సోమవారం నుండి విద్యాసంస్థలు ప్రారంభం: విద్యశాఖ కమిషనర్.

సోమవారం నుండి విద్యాసంస్థలు ప్రారంభం: విద్యశాఖ కమిషనర్.


హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి యథాతథంగా పనిచేయనున్నాయి. గతనెల 28 నుంచి ప్రారంభమైన దసరా సెలవులు శనివారంతో ముగిశాయని, సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభంకానున్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఈ నెల 23 నుంచి ప్రారంభంకావాల్సిన సమ్మెటివ్-1 పరీక్షలను ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహిస్తామని చెప్పారు. సరిచేసిన సమ్మెటివ్ -1 టైంటేబుల్‌ను విడుదలచేశామని, ఈ మేరకు విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూనియర్ కాలేజీలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఇప్పటికే తెలిపారు. వీటితోపాటు డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి అన్ని కాలేజీలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయని ఆయా కళాశాలల యాజమాన్యాలు, విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం