ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్ భరోసా కింద రైతులకు ఉచితంగా బోరు బావులను ఏర్పాటు చేయడంపై చర్చించినట్లు తెలుస్తోంది. తృణ ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా మిల్లెట్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. వైఎస్సార్ ల్యాబ్స్ ఏర్పాటు అంశంపైనా చర్చించారు. రైతు భరోసా మొత్తాన్ని రూ.12,500 నుంచి 13,500కు పెంచుతూ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆర్థిక సహకార సంస్థల ద్వారా స్వయం ఉపాధి కోసం ఇచ్చే రుణాల దరఖాస్తు గడువు పెంపుపై చర్చించారు. జనవవరిలో ఉద్యోగాలను భర్తీ చేయాలని తీర్మానించారు. అదేవిధంగా అమ్మ ఒడి పథకంపై కేబినెట్‌లో చర్చించారు.