ఆచార్య  ఎంజీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్   దామోదర నాయుడు అరెస్ట్

ఆచార్య  ఎంజీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్  వల్లభనేని దామోదర నాయుడు అరెస్ట్ చేసినట్లు తుళ్ళూరు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు


గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమ పట్నం కి చెందిన ఉయ్యాల మురళీకృష్ణ 2016 లో ఆచార్య  ఎంజీ రంగా విశ్వవిద్యాలయంలో అటెండర్ గా నియామకం అయ్యాడు. ఎటువంటి సమాచారం లేకుండా 2019 ఏప్రిల్ నెలలో ఉద్యోగం నుండి వైస్ ఛాన్సెలర్ దామోదర నాయుడు తొలగించారు.
ఉద్యోగం తిరిగి ఇప్పించాలని గత నెల 23 వ తేదీన వెలగపూడి సచివాలయంలో ని 2 వ బ్లాక్ వద్ద దామోదర్ నాయుడు ని అటెండర్ మురళీ కృష్ణ  తన మిత్రుడు గుమ్మడి రాజేష్ తో కలిసి  ఉద్యోగం కొరకు వెడుకొనగా,  తనను కులం పేరుతో దూషించి బెదిరింపు లకు పాల్పడినట్లు మురళీకృష్ణ తుళ్ళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గతనెల 24 న దామోదర్ నాయుడు పై తుళ్ళూరు పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. సచివాలయంలో లోని సిసి ఫుటేజ్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు గుంటూరు లోని నవభారత్ నగర్ లో  దామోదర్ నాయుడు ని ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చాగా రిమాండ్ కు తరలించినట్లు తుళ్ళూరు పోలీసులు తెలియజేసారు


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం