అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..


09 - 10 - 2019...
సచివాలయం


అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..


దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు


దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదు


ఎన్నికల ప్రచారంలో అర్చకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అర్చక సమాఖ్య నాయకులు 


ముఖ్యమంత్రి ఆదేశాలతో బుధవారం సచివాలయంలో అర్చకులతో సమావేశమైన మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ పద్మ, tirupati jeo బసంత్ కుమార్, ఎమ్మెల్యే విష్ణు     భేటీలో పాల్గొన్న అర్చక సమాఖ్య బ్రాహ్మణ సమైక్య నాయకులతో పాటు పురోహితులు 13 జిల్లాల నుంచి హాజరైన బ్రాహ్మణ సంఘాల నాయకులు....


 జీవో నెంబర్ 76 ను అమలు చేయాలంటూ మంత్రిని కోరిన అర్చక సంఘాలు


 ధార్మిక పరిషత్ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన అర్చక సంఘాలు.


 సబ్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపిన మంత్రి వెల్లంపల్లి


దేవాలయ భూములు మరియు ఆస్తుల పరిరక్షణకు కృషి


అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం  కొనసాగించేందుకు చర్యలు..


 అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా అర్చకత్వం నిర్వహించేందుకు.  దీనికోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు తీరును పరిశీలన.....


కనీస ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం  5 నుంచి 10 వేలకు పెంచడానికి చర్యలు
..
10000 ఉన్న భృతిని 16500...


 ప్రస్తుతం 1600 దేవాలయాల్లో దూపదీప నైవేద్య పథకం అమలవుతోంది
దీన్ని 3,600 దేవాలయాలకు వర్తించేలా చర్యలు.


డి డి ఎస్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని 10 వేలకు పెంచేందుకు చర్యలు..


 శాశ్వత ప్రాతిపదిక మీద ధార్మిక పరిషత్తు మరియు అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు చర్యలు..


ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు సమానంగా హెల్త్ కార్డు 


 దేవాదాయ కమిషనర్ కార్యాలయం సముదాయం లో ఉన్న అర్చక సంక్షేమ భవనాన్ని విస్తరిస్తాం....


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం