రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్న సమ్యక్-2019

కేఎల్‌యూలో జాతీయ స్థాయి సాంకేతిక నిర్వ‌హ‌ణ ఉత్స‌వం
*     రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్న సమ్యక్-2019
 , అమ‌రావ‌తి: జాతీయ స్థాయి సాంకేతిక నిర్వహణ ఉత్సవ సమ్యక్-2019 రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ  సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎల్.ఎస్.ఎస్ రెడ్డి మాట్లాడుతూ, సమ్యాక్ 2019 ఈ సంవత్సరం సరికొత్త ఉత్తేజకరమైన సంఘటనలతో తిరిగి వచ్చేసిందన్నారు.  సమ్యక్ యొక్క 12వ ఎడిషన్‌లో “అనంత విశ్వ” అనే మనోహరమైన సందేశంతో ఈ నెల 18,19 తేదీలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ కమిషన్ చైర్మన్, జే.ఎన్.టి.యు అనంతపురానికి చెందిన  కొనిరెడ్డి హేమచంద్ర రెడ్డి ముఖ్య‌ అతిధులుగా హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి  విద్యార్ధులు పాల్గొంటారని తెలిపారు. సాంకేతిక ప్రదర్శనలతో పాటు విద్యార్ధులను అలరించేలా రెండు రోజులూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నేటి డిజిటల్ ప్రపంచంలో యువతలో ఉండే సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ఫెస్ట్ లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ ఫెస్ట్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికి  జ్ఞానం, ఆవిష్కరణలు, వినోదం అందిచే లక్ష్యంగా తాము ఎంతో కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులోని నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ ఉత్సవమును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్ధులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగేలా విద్యా విధానం ఉండాలని, ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో నేటి యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, అయితే వాటిని సాధించాలంటే విద్యార్ధులు అవసరమైన సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్ధులు  అన్ని రంగాలలో నైపుణ్యం సాధించేలా తమ విద్యా విధానం ఉంటుందని అందులో భాగంగానే సమ్యక్, వంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమాలు పూర్తిగా  విద్యార్ధుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని, ఈ రెండు రోజుల కార్యక్రమాల ద్వారా వారిలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. తమ విద్యార్ధులు ఇటీవలి కాలంలో అనేక జాతీయ స్థాయి అవార్డులు సాధించారని, మెకానికల్, సి ఎస్ ఇ, ఇ సి ఇ, ఎలక్ట్రికల్ విదార్ధులు వివిధ పోటీలలో సత్తా చాటి వారిలోని సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించి అవార్డులను సాధించారని చెప్పారు. అనంతరం సమ్యక్ ఛైర్మన్ డాక్టర్ కేఎల్ నారాయణ మాట్లాడుతూ, ఈ సమ్యక్ లో 40 ఫుడ్ స్టాల్స్, 38 సదస్సులు,120 టెక్నికల్,30 నాన్‌టెక్నిక‌ల్ అంశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సమ్యక్ కన్వీనర్  డాక్టర్ వేగే హరికిరన్ సమ్యక్ చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Popular posts
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌
చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు
టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల చేసిన చంద్రబాబు
Image