వైసీపీ ఇసుక దందాకు తాపీమేస్త్రీ బలి: కళా

వైసీపీ ఇసుక దందాకు తాపీమేస్త్రీ బలి: కళా
గుంటూరు : వైసీపీ నేతల ఇసుక దందాకు తాపీమేస్త్రీ నాగబ్రహ్మాం బలయ్యాడని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. నాగబ్రహ్మాం ఆత్మహత్య పట్ల ఆయన దిగ్ర్భాంతి, విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పడుతున్న ఇబ్బందులకు నాగబ్రహ్మాం ఆత్మహత్య సజీవ సాక్ష్యమని చెప్పారు. ఉపాధి లేక కార్మిక కుటుంబాలు పస్తులు ఉంటున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక పంపకాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చిన విభేదాలను పరిష్కరించేందుకు జగన్ మధ్యవర్తిత్వం వహించడం సిగ్గుచేటన్నారు. ఇసుక వాటాలపై చూపిన శ్రద్ధ.. కూలీల ఉపాధిపై జగన్ చూపించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాగబ్రహ్మాం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో కూలీకి రూ.10 వేల భృతి ఇవ్వాలని కోరారు.