శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్ పై సిఎస్ సమీక్ష


21.10.2019
అమరావతి 


శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్ పై సిఎస్ సమీక్ష


అమరావతి,21 అక్టోబరు: నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదిత పథకాలన్నిటినీ సకాలంలో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో నేషనల్ రూర్బన్ మిషన్ పై సిఎస్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎంపవర్ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాలను ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన పూర్తిస్థాయి కనీస మౌళిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ రూర్బన్ మిషన్ ను అమలుచేస్తున్నాయని పేర్కొన్నారు. కావున ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలు, గిరిజన గ్రామాల్లో ప్రతిపాదించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మైదాన ప్రాంతాల్లో 25వేల నుండి 50వేల జనాభా కలిగిన గ్రామాలు, కొండ గిరిజన ప్రాంతాల్లో 5వేల నుండి 15వేల జనాభా గల ప్రాంతాలను క్లస్టర్లుగా ఎంపిక చేసి 60శాతం కేంద్రం,40శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు.


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేషనల్ రూర్బన్ మిషన్ కింద 12 క్లస్టర్లను కేటాయించగా మూడు దశలుగా 1130 కోట్ల రూ.లతో 10వేల 364 పనులు చేపట్టి వీటిని అభివృద్ధి చేయనున్నారని సిఎస్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 865 కోట్ల రూ.లతో 9వేల 194 పనులు చేపట్టగా వాటిలో 498కోట్ల రూ.ల విలువైన 6వేల 360 పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన క్లస్టర్లలో ముఖ్యంగా పైపుల ద్వారా మంచినీటిని అందించడం, పూర్తిస్థాయి పారిశుద్ధ్య నిర్వహణ, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, డ్రెయిన్లు, వీధి దీపాలు, అంతర్గామ కనెక్టవిటీ, ప్రజారవాణా, ప్రతి ఇంటికీ ఎల్పీజి కనెక్షన్, నైపుణ్య శిక్షణ ద్వారా ఆర్ధికాభివృద్ధికి చర్యలు తీసుకోవడం వంటివి ఈ పథకంలోని ప్రధాన లక్ష్యాలను సిఎస్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అదే విధంగా విద్య ఆరోగ్యం, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సేవలు, డిజిటల్ లైబ్రరీ, పర్యావరణం, ఉపాధి కల్పన, స్వయం సహాయ సంఘాల ఏర్పాటు, పర్యాటకరంగ ప్రోత్సాహం, క్రీడలు మరియు సామాజిక మౌళిక సదుపాయాల కల్పన, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం తదితర అంశాల్లో ఈ క్లస్టర్లలో పూర్తిగా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని సిఎస్ తెలిపారు. 


 రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలైన ఏలూరు క్లస్టర్ డిపిఆర్, రంపచోడవరం క్లస్టర్ రివైజడ్ అప్రోవల్ గురించి వివరించగా వాటికి సమావేశంలో ఆమోదం తెలిపారు. అలాగే సింగరాయకొండ, కుప్పం, అరకులోయ, ఆలూరు, చందర్లపాడు, గరివిడి, నందలూర్, న్యూజెండ్ల రివైడ్జ్ డిపిఆర్ లకు ఆమోదం తెలిపారు. ఇంకా నేషనల్ రూర్బన్ మిషన్ కు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.


 ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్ మోహన్ సింగ్, ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, అజయ్ జైన్, కె.దమయంతి, మున్సిపల్ శాఖ కమిషనర్ జిఎస్ఆర్ విజయ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


 


........


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image