తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ప్రకటించాలి

అంతిమతీర్పు- తిరుపతి. 8.10.209


*తిరుపతి నీ బాలాజి రైల్వే డివిజన్ గా ప్రకటించాలి*


*ఆర్ సి గేట్ అండర్ బ్రిడ్జి నీ వెంటనే పూర్తి చేయాలి*


*రైల్వే బోర్డు చైర్మన్ కు వినతి పత్రం సమర్పిం చిన జే ఏ సి నాయకులు*


తిరుపతి నీ బాలాజి రైల్వే డివిజన్ గా ప్రకటించాలి, ఆర్ సి గేట్ అండర్ బ్రిడ్జి నీ వెంటనే పూర్తి చేయా లని తదితర డిమాండ్ల తో మంగళవారం తిరుపతి కి వచ్చిన రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కు విద్యార్థి యువజన ప్రజా సంఘాల జే ఏ సి నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. 
   ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్) రాష్ట్ర అధ్యక్షుడు *ఎన్. రాజారెడ్డి,* డీ వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి *యస్. జయచంద్ర*, నవ సమాజ ఫెడరేషన్ అధ్యక్షుడు *నిరుగట్టు నగేష్* లు మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న తిరుపతి మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో వున్నదని అన్నారు. తిరుపతి నీ బాలాజి రైల్వే డివిజన్ గా చేస్తే వేలాది  మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఇంకా అనేక ప్రాంతాలకు రైళ్ళను కనెక్ట్ చేయవచ్చని ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు,  తిరుపతి లో అతి ముఖ్యమైన సమస్య రైల్వే అండర్ బ్రిడ్జి లని వాటిలో ముఖ్యంగా రాయలచేరువు గేట్ మరియు ఆర్టీసీ బస్టాండ్ ఎదురు గల గేట్ ల వద్ద అండర్ బ్రిడ్జి లని సత్వరమే పూర్తి చేయాలని కోరారు ఆర్ సి గేట్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే 8 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 8 కోట్ల రూపాయలు కలిపి 16 కోట్ల రూపాయలు వ్యయంతో ప్రతిపాదన పంపారు, ఈ ప్రతిపాదన మేరకు నిధులు మంజూరు చేస్తామని ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు హామీని నిలబెట్టుకో లేదని విమర్చించారు. 


      ఆప్స్ జిల్లా అధ్యక్షుడు *షేక్ మహమ్మద్ రఫీ*, ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలాజి మాట్లాడుతూ తిరుపతి పడమర రైల్వే స్టేషన్ ను ప్యాసింజర్ రైళ్లు టెర్మినల్ గా అభివృద్ధి చేయాలని కోరారు రేణిగుంట వద్ద గల సి ఆర్ ఎస్ ను మరింత విస్తృత పరచి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. 
   ఈ కార్యక్రమంలో నాయకులు కోటేశ్వరరావు, నరేంద్ర, పెదరాయుడు తదితులున్నారు.