ఉగాది నాటికి పేదలకు ఇళ్లపట్టాలు,

17–10–2019
అమరావతి


అమరావతి: ఉగాది నాటికి పేదలకు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు బొత్స, బుగ్గన, రంగనాథరాజు హాజరు


పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కన్నా.. ఇళ్లస్థలాలు కేటాయించి వాటిలో ఇళ్లు కట్టించాలని అధికారులకు సీఎం ఆదేశం
పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పేదలు ఉంటున్న ఫ్లాట్లలో నిర్వహణ సరిగ్గా లేదన్న సీఎం
దీనివల్ల అపరిశుభ్రపరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్లాట్లు దెబ్బతింటున్నాయన్న సీఎం, మళ్లీ పరిస్థితులు మొదటి వస్తున్నాయన్న ముఖ్యమంత్రి
ఫ్లాట్ల కారణంగా కొంతకాలానికి నిర్వహణ ఇబ్బంది అవుతుంది:
నిర్వహణ లేకపోతే.. ప్లాట్లు ఇచ్చినా పెద్దగా మార్పు ఉండదు:
దీనికి పరిష్కారంగా పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట ఫ్లాట్లు స్థానంలో స్థలాలు ఇచ్చి, అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలి:
అలాగే ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న ఫ్లాట్లను బాగుచేసుకునేలా ఏదైనా ఆలోచన చేయాలి:


కాలక్రమంలో పట్టణాల్లో ఎక్కువ సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరిగిపోయాయి: సీఎం
అభ్యంతరంలేని అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్‌పై విధివిధానాలు తయారుచేయండి: సీఎం
ఇలా గుర్తించిన వాటిలో 2 సెంట్ల వరకూ నామమాత్రపు ఫీజుకే రిజిస్ట్రేషన్‌ చేయాలి, అధికారులకు సీఎం ఆదేశం
స్థలం 2 సెంట్లకు పైబడితే రెగ్యులరైజేషన్‌ ఫీజు ఎంత ఉండాలన్నదానిపై ప్రతిపాదనలు తయారుచేయాలన్న ముఖ్యమంత్రి


నదీతీరాల వెంబడి, కాల్వ గట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు : సీఎం
ప్రభుత్వం స్థలాల కేటాయింపులో, ఇళ్లనిర్మాణంలో వీరికి స్థానం కల్పించాలి
ఇందులో ప్రజల భద్రతకు ముప్పుగా ఉన్నవాటిని గుర్తించండి
వాళ్లకి మనం కట్టే ఇళ్లలో స్థానం కల్పించండి
ప్రజల ప్రాణాలకు ముప్పులేని, అభ్యంతరం లేని ఇళ్లను రెగ్యులరైజ్‌ చేయండి


ఇంతకుముందు స్థలం ఇచ్చినా రిజిస్టర్‌ చేసే వాళ్లుకాదు, ఇప్పుడు మనం రిజిస్టర్‌చేస్తున్నాం: సీఎం
చంద్రబాబుగారు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలను లాక్కున్నారు: సీఎం
ప్రభుత్వం ఒక్కసారి పేదలకు ఇచ్చిన తర్వాత ఎలా లాక్కుంటారు?: సీఎం
ఇళ్ల నిర్మాణంకోసం వీలైనంతమేర ప్రభుత్వస్థలాలనే వాడుకోవాలన్న సీఎం


గ్రామ సభలద్వారా లబ్ధిదారుల ఎంపికను వివరించిన అధికారులు
ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 20,47,325గా తెలిపిన అధికారులు, ఇంకా పెరిగే అవకాశం ఉందని సీఎంకు వెల్లడి
రూరల్‌లో ఇప్పటివరకూ 19,389 ఎకరాల గుర్తింపు, రూరల్‌లో 8వేల ఎకరాలు అవసరమవుతుందని అంచనా
అర్బన్‌ ప్రాంతాల్లో 2,559 ఎకరాల గుర్తింపు, ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతుందని అంచనా 
దాదాపు రూ.10–12 వేలకోట్లు ఖర్చు అవుతుందని ఉజ్జాయింపుగా చెప్పిన అధికారులు 


తప్పనిసరిగా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలన్న సీఎం
ఇళ్లస్థలాలకోసం ఎందుకు అర్హత సాధించలేకపోతున్నారో.. అ వివరాలు కూడా లబ్ధిదారులకు  తెలియజేయాలి: సీఎం
గత ప్రభుత్వంలో ఇళ్లపట్టాలు, ఇళ్లు విషయలో వైసీపీకి ఓట్లేశారని, వైయస్సార్‌సీపీకి సానుభూతి పరులంగా వారికి నిరాకరించాన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్లపట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించిన సీఎం
గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే లబ్ధిదారుల జాబితా కింద సూచనలు కూడా ఉంచాలన్న ఈసెం
ఎవరైనా అర్హులని భావిస్తే... ఎవరికి ఎలా దరఖాస్తు చేయాలి? ఎలా నమోదుచేయాలి? ఎవరిని సంప్రదించాలి? అన్న పద్దతులుకూడా తెలియజేయాలని స్పష్టంచేసిన సీఎం
జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాటు చేసుకోవాలని, లక్ష్యం కన్నా మరో 10శాతం అదనంగా ఇళ్లస్థలాలను బఫర్‌ పెట్టుకుంటే దరఖాస్తుదారులు అనుకున్నదానికంటే ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటుందన్న సీఎం.


అభ్యంతరంలేని అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్‌పై విధివిధానాలు తయారుచేయండి: సీఎం
*ఇలా గుర్తించిన వాటిలో 2 సెంట్ల వరకూ 1 రూపాయి ఫీజుకే రిజిస్ట్రేషన్‌ చేయాలి, అధికారులకు సీఎం ఆదేశం*
స్థలం 2 సెంట్లకు పైబడితే రెగ్యులరైజేషన్‌ ఫీజు ఎంత ఉండాలన్నదానిపై ప్రతిపాదనలు తయారుచేయాలన్న ముఖ్యమంత్రి


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం