అధ్యక్షా.. ఎందుకింత అతిగా స్పందించారు?  :వర్ల రామయ్య

తేది 15-10-2019.


విలేకరుల సమావేశం వివరాలు...


 పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షా.. ఎందుకింత అతిగా స్పందించారు?  


- శ్రీనివాస్‌పై సుమోటాగా ఐపీసీ-506కింద కేసు నమోదు చేయాలి.


- విశాఖ విమానాశ్రయంలో ఐపీఎస్‌ అధికారిని జగన్‌ ఏమన్నాడో నీకు తెలియదా?


- పెద్దరెడ్ల దౌర్జన్యంపై స్పందించని వ్యక్తి, తనపై తొడకొట్టి, మీసంతిప్పడమేంటి?


                                                   - శ్రీ వర్లరామయ్య.


రాష్ట్రపోలీస్‌ కేంద్ర కార్యాలయ ఆవరణలో, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌అధికారుల సంఘం అధ్యక్షుడు, మరికొందరితో కలిసి, విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన శ్రీనివాస్‌ తనగురించి, చాలా ఎక్కువగా మాట్లాడాడని... తానేదో పోలీస్‌వారిని కించపరిచానని, తనపై చర్యలు తీసుకుంటామంటూ బిగ్గరగా మాట్లాడుతూ, తొడలుకొట్టడం, మీసాలు తిప్పడం, ఖబడ్దార్‌ అనడం, నీసంగతి తేలుస్తాననడం ఏమిటని,  టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళవారం గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీనివాస్‌ పోలీస్‌అధికారా..లేక మాప్రత్యర్థి పార్టీకి చెందిన రాజకీయనాయకుడో అర్థంకావడం లేదన్నారు. తొడలుకొట్టడం, మీసాలు మెలేయడం ద్వారా ఆయన తనని యుద్ధానికిపిలుస్తున్నాడో... కుస్తీకి రమ్మంటున్నాడో తెలియడం లేదన్నారు. రాజకీయనాయకులు కూడా మాట్లాడని విధంగా ఆయన భాష , ప్రవర్తన ఉన్నాయని రామయ్య చెప్పారు. పోలీస్‌అధికారిగా ఆయనలా ప్రవర్తించడం వెనుక ఎవరిప్రేరణ ఉందో చెప్పాలన్నారు. తొడలుకొడుతూ, మీసాలుతిప్పుతూ మాట్లాడటా నికి ఇది ఎన్నికల సమయం కూడా కాదుకదా... అని వర్ల ఎద్దేవాచేశారు. తాను కూడా ఆయనపట్ల అలానే ప్రవర్తించి ఉంటే, చట్టపరంగా తనపై కేసునమోదు చేయించి, చర్యలు తీసుకుంటే బాగుండేదని, న్యాయస్థానాల్లోనే ఎవరు తప్పుచేశారో తేలేదని టీడీపీనేత స్పష్టంచేశారు. రాష్ట్ర పోలీస్‌అధికారు సంఘం అధ్యక్షుడు ఇంత సీన్‌ ఎందుకు క్రియేట్‌ చేశారో, సమాధానం చెప్పాలన్నారు. శ్రీనివాస్‌ అన్ని విషయాల్లో ఇలానే స్పందించేటట్లయితే అధికారపార్టీకి చెందిన చంద్రగిరి శాసనస భ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలీసులను దుర్భాషలాడినప్పుడు ఏం చేశారని వర్ల నిలదీశారు. ''పోలీసులూ.... ఖబడ్దార్‌.. మేంఅధికారంలోకి వస్తాం..మిమ్మల్ని.. మీకుటుంబసభ్యులను ఎవరినీ వదలను'' అని చెవిరెడ్డి తీవ్రస్వరంతో హెచ్చరించినప్పుడు శ్రీనివాస్‌ ఎ్కడున్నాడన్నారు. చెవిరెడ్డిలా తానేమీ హద్దుమీరి మాట్లాడలేదని, మీపై అధికారులను రిక్వెస్ట్‌మాత్రమే చేశాననే విషయాన్ని మీరెందుకు తెలుసుకోవడం లేదన్నారు. నెల్లూరు రూరల్‌ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఒక ఎస్టీ సర్కిల్‌ఇన్‌స్పెక్టర్‌ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని, నిమిషాలమీద ఆ ఇన్‌స్పెక్టర్‌ని బదిలీ చేయించారని   , ఇప్పటికీ అతనికి ఎక్కడా పోస్టింగ్‌ కూడా లేదని, దీనిపై శ్రీనివాస్‌ ఎందుకు స్పందించడం లేదని, శ్రీధర్‌రెడ్డిపై ఎందుకు తొడకొట్టి, మీసం మెలేయలేదని రామయ్య నిగ్గదీశారు. వైజాగ్‌ విమానాశ్రయంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, విశాఖనగరపోలీస్‌ కమిషనర్‌ని ఉద్దేశించి, ప్రతిపక్షనేత జగన్‌ ఎలా మాట్లాడారో... పోలీస్‌అధికారి విషయంలో ఎంత దురుసుగా ప్రవర్తించారో శ్రీనివాసుడికి తెలియదా అన్నారు. మరి ఆనాడు జగన్మోహన్‌రెడ్డి ని ఉద్దేశించి, ఖబడ్దార్‌ జగన్మోహన్‌రెడ్డి, మా ఐపీఎస్‌ అధికారి జోలికొస్తే, ఊరుకోమని  నన్ను హెచ్చరించినట్లు జగన్‌ని ఎందుకు అనలేదన్నారు. వాళ్లంతాపెద్దపెద్ద రెడ్లని వారిని వదిలేసి, ఎస్సీననే ఉద్దేశంతో శ్రీనివాస్‌ తనపై తొడగొట్టి, మీసంతిప్పాడా అని రామయ్య  ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అధికారులసంఘం అధ్యక్షుడైన శ్రీనివాస్‌కు  విలేకరుల  సమావేశం పెట్టే అర్హత ఎక్కడిదని వర్ల నిలదీశారు. అదొక సంఘమని, ట్రేడ్‌యూనియన్‌ కాదని, దానికి సంబంధించిన నియమనిబంధనలు శ్రీనివాస్‌కు పూర్తిగా తెలిసినట్లు లేవని దెప్పిపొడిచారు. విజ్ఞప్తులు, వినతుల ద్వారానే సంఘం తరుపున తమకు ఉండే సమస్యలను పరిష్కరించుకోవాలనే కనీస ఇంగితం శ్రీనివాస్‌కు లేకపోవడం విచారకరమన్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రతిపక్షపార్టీ నాయకులను, ముఖ్యంగా ఎస్సీనేతల్ని ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడి న శ్రీనివాస్‌పై డీజీపీ వెంటనే క్రమశిక్షణా చర్యలుతీసుకోవాలని రామయ్య డిమాండ్‌ చేశారు. ప్రభుత్వఉద్యోగిగా ఉన్నవ్యక్తి, సివిల్‌కాండక్ట్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని, ట్రేడ్‌యూనియనిస్ట్‌గా మాట్లాడాడని, సదరు వ్యక్తి పోలీస్‌కార్యా లయంలో సమావేశం నిర్వహిస్తే, పోలీస్‌వ్యవస్థ ఏమిచేస్తోందన్నారు. శ్రీనివాస్‌ చర్యలను, వ్యాఖ్యలను, ప్రవర్తనను, బెదిరింపుధోరణిని రాష్ట్రపోలీస్‌ బాస్‌గా డీజీపీ సమర్థిస్తున్నారా.. అని వర్ల ప్రశ్నించారు. పోలీస్‌ అసోసియేషన్‌ బైలాస్‌ తయారుచేసిన వారితో తానూ ఒకడినని, 27 ఏళ్లపాటు పోలీస్‌అధికారిగా పనిచేసిన తనకు డిపార్ట్‌మెంట్‌లోని నియమ నిబంధనలు, నీతినియమావళి తెలుసునని రామయ్య చెప్పారు. శ్రీనివాస్‌ వెనుక ఎవరున్నా రో, ఎవరి ప్రమేయంతో ఆయనలా మాట్లాడాడో తేల్చాల్సిన బాధ్యత రాష్ట్రడీజీపీపైనే ఉందని, సుమోటాగా ఐపీసీసెక్షన్‌-506 కింద తనను బెదిరించినందుకు ఆయనపై  కేసునమోదు చేయాలని, ఎస్సీవర్గానికి చెందిన నాయకుడిని దుర్భాషలాడినందుకు చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్‌చేశారు. పెద్దరెడ్లు అందరూ పోలీసులపట్ల నీచంగా, దారుణం గా మాట్లాడినా స్పందించని వ్యక్తి, తనవిషయంలోనే ఎందుకిలా అతిగా స్పందించాడో  తేల్చాలన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఒకలా...తన విషయంలో మరోలా ప్రవర్తించినందుకే తాను కులంప్రస్తావన తీసుకురావడం జరిగిందని రామయ్య తెలిపారు.     పోలీస్‌బాస్‌ని ఉద్దేశించి కూడా తానెప్పుడూ అమర్యాదగా మాట్లాడలేదని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మాత్రమే విజ్ఞప్తిచేశానన్నారు. పోలీస్‌అధికారుల సంఘం అధ్యక్షుడి గా శ్రీనివాస్‌ అలా వ్యవహరించడం తప్పో, ఒప్పో సంఘంలోని పోలీస్‌సోదరులే చెప్పాలని  , పోలీస్‌శాఖ తనకు మాతృసంస్థ అనే విషయాన్ని వారందరూ గ్రహించాలని సూచించారు. తప్పుచేసిన పోలీస్‌అధికారులను మాత్రమే తాను, తనపార్టీ తప్పుపట్టిందని, పోలీసులు  చట్టప్రకారం వ్యవహరించకుండా, అధికారపార్టీ ఆదేశాలను తూచాతప్పకుండా పాటించడాన్నే తాము తొలినుంచీ వ్యతిరేకిస్తున్నామని రామయ్య స్పష్టంచేశారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image