01–10–2019
అమరావతి
అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్లర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు
పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్
*స్పందనపై వర్క్‌షాప్‌లు*
స్పందనలో నాణ్యత పెంచడానికి గతంలో అనుకున్న ప్రకారం వర్క్‌షాపులు జరుగుతున్నాయి
ఇప్పటికే సీఎస్ వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు
అక్టోబరు 16 నుంచి అక్టోబరు చివరి వరకూ జిల్లాల్లో అధికారులకు శిక్షణ,
వీటిలో కలెక్టర్లు పాల్గొనాలి
అక్టోబరు 2న గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం అవుతున్నాయి:
నవంబర్ నెలాఖరు నాటికి అన్ని సదుపాయాలు గ్రామ సచివాలయాలకు అందుతాయి:
గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్ఫోన్లతో సహా కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాలకు చేరాలి
డిసెంబర్ 1 నాటికి గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభం కావాలి:
ఈలోగా గ్రామ సచివాలయాల కార్యాలయాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలి:
డిసెంబరులో ఏవైనా లోపాలు ఉంటే.. వాటిని సరిదిద్దుకోవాలి:
జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌరులకు అందాలి:
వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో బోర్డులపై పెట్టాలి:
జనవరి 1 నుంచి అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి:
ఈమేరకు కార్యాచరణ సిద్ధంచేయాలి:
గ్రామ సచివాలయాలు జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక ప్రతిరోజూ స్పందన కార్యక్రమం చేపట్టాలి:
72 గంటల్లోగా రేషన్‌కార్డు, పెన్షన్లు లాంటి సేవలు అందాలి:
వివక్ష, పక్షపాతం లేకుండా, లంచాలు లేకుండా ప్రజలకు సేవలందాలి:
ఇది జరిగితే... ఒక మంచి మైలురాయిని మనం అందుకున్నట్టే:
దీనికి సంబంధించిన యంత్రాంగం గ్రామ సచివాలయాలనుంచి కలెక్టర్లకు, శాఖాధిపతులకు అనుసంధానం ఉండాలి:
దేశంలోనే ఇలాంటి కార్యక్రమం జరుగుతుందో లేదో నాకు తెలియదు:
గ్రామాల వారీగా, వార్డుల వారీగా పరిపాలనలో ఇది విప్లవాత్మక మార్పు:
కలెక్టర్లు, అధికారులు పూర్తిస్థాయిలో ధ్యాసపెట్టాల్సిన అవసరం ఉంది:
తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు.. ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు.. ఈ అంశాలను వారికి వివరించండి:
*వైఎస్ఆర్ వాహనమిత్ర*
అక్టోబరు 4న సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి రూ.10వేలు ఇస్తున్నాం:
అక్టోబరులో ఏలూరులో ఆటో డ్రైవర్లకు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి:
ఈ డబ్బు అంతా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో ఉండేలా చూడాలి:
మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల్లో ఈ పథకం మంజూరు పత్రాలు అందజేత
ఇప్పటివరకూ వచ్చిన అప్లికేషన్లు 1,75,309
పరిశీలించిన అప్లికేషన్లు 1,69,080
ఆమోదం పొందిన అప్లికేషన్లు 1,67,283
కలెక్టర్లు ఇప్పటికే మంజూరు చేసినవి రూ.1,64,295 అప్లికేషన్లు
ఇవాళ టెస్ట్‌రన్ చేస్తున్న ఆర్థిక శాఖ
అక్టోబరు 4వ తేదీన డబ్బు డిపాజిట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది
ఆమేరకు లబ్ధిదారులకు ఎస్ఎంఎస్
శాంక్షన్ ఆర్డర్‌ను కూడా లబ్ధిదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు
*గ్రామ సచివాలయాలపై సమీక్ష*
గ్రామ వాలంటీర్లుగా ఉన్నవారు గ్రామ సచివాలయ ఉద్యోగాలకు రాసి, ఎంపికై ఉండొచ్చు: సీఎం
ఖాళీ అయిన చోట్ల వారిని భర్తీ చేయాలి: సీఎం
అవసరమైన చోట అర్హతలను తగ్గించే అవకాశాలను పరిశీలించాలి: సీఎం
ఇంటర్మీడియట్‌ను అర్హతగా పరిగణిస్తే ఇక్కడ భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయి: సీఎం
అక్టోబరు 15 నుంచి మొత్తం వాలంటీర్ల నియామకం జరగాలి:
ఖాళీ అన్న మాట నాకు వినిపించకూడదు :
వాలంటీర్ పోస్టు ఖాళీగా ఉంటే... ప్రయోజనాలు నెరవేరవు:
చివరస్థాయిలో అనుసంధానం నిలిచిపోతుంది:
క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి:
*కంటివెలుగు*
కంటివెలుగు కార్యక్రమంపై సీఎం సమీక్ష
కంటివెలుగు కింద ప్రభుత్వ స్కూళ్లే కాదు, ప్రైవేటు స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు కూడా కవర్కావాలి: సీఎం
డేటాను కూడా సిద్ధంచేయాలి: సీఎం
కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి 42,360 ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14వేల మంది ఏఎన్ఎంలు, 14వేలమంది పబ్లిక్ హెల్త్ స్టాఫ్ శిక్షణ పొందుతున్నారు
స్కూలు వారీగా సూక్ష్మస్థాయి ప్రణాళిక తయారు చేస్తున్న ప్రభుత్వం
సిబ్బందికి కిట్లను పంపిణీచేస్తున్న ప్రభుత్వం
అక్టోబరు 10 నుంచి 16 వరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులకు స్క్రీనింగ్
వారికి చికిత్స అందించే కార్యక్రమం నవంబరు 1 నుంచి డిసెంబరు 31వరకూ అమలు
*మహిళ్లలో, పిల్లల్లో పౌష్టికాహారలోపం, రక్తహీనత ఉన్న అంశంపై దృష్టిపెట్టాం: సీఎం*
గ్రామ వాలంటీర్ల ద్వారా వీరిని పరీక్షించే కార్యక్రమాన్ని చేపట్టాలి: సీఎం
అంగన్ వాడీ కేంద్రాల్లో స్క్రీనింగ్ చేయమని చెప్పాం : సీఎం
ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలి: సీఎం
ఈ సమస్యకు కచ్చితంగా పరిష్కారం చూపాలి: సీఎం
పిల్లల్లో పౌష్టికాహారం కోసం గతంలో ఇచ్చే రూ.8లను రూ.18ల వరకూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం:
అలాగే తల్లులకూ మంచి ఆహారం అందించడానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం:
గర్భంతో ఉన్న మహిళలను, పిల్లల తల్లులను మనం బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది: సీఎం
వీరికి రోజుకు రూ.50లు ఖర్చుచేసి మంచి ఆహారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం:
గ్రామ వాలంటీర్ల భాగస్వామ్యం తీసుకోండి:
తమకు కేటాయించిన కుటుంబాల్లోని ప్రతి చిన్నపిల్లల కుటుంబానికి, గర్భంతో ఉన్న మహిళలకు, చిన్నపిల్లలకు ఈ కార్యక్రమం గురించి చెప్పాల్సి ఉంది:
అంగన్ వాడీ కేంద్రాల్లో వీరి వివరాలను పొందుపరచాలి:
ప్రతి ఆడపిల్ల డిగ్రీ చదవాలి, ఆతర్వాతనే ఆడపిల్లకు పెళ్లి అయితే బాగుంటుంది:
21 ఏళ్లకు ఆడపిల్ల పెళ్లిచేసుకోవాలన్న ప్రచారం బాగా వెళ్లాలి:
దీనిపై ప్రచారం నిర్వహించండి:
రాష్ట్రంలోని రక్తహీనత సమస్య అధికంగా ఉంది:
తక్కువ వయస్సులో పెళ్లి కారణంగా పుట్టే పిల్లలకూ ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి:
*సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ః*
రాష్ట్రస్థాయి సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి: సీఎం
కనీసం నలుగురు సీనియర్ సిటిజన్స్ ఈ కౌన్సిల్లో ఉంటారు: సీఎం
కనీసం నెలకోసారి మాతో వీరు సమావేశం అవుతారు: సీఎం
అదే రీతిలో జిల్లాల స్థాయిలో కూడా ఈ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి: సీఎం
ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్స్ అవుతారు: సీఎం
మనం వాళ్లని సరిగ్గా చూసుకోకపోతే.. రేపు మనల్ని చూసుకునేవాళ్లు ఉండరు: సీఎం
సీనియర్ సిటిజన్స్‌ను సరిగ్గా చూసుకునే కార్యక్రమాలు చేయాలి:
వారికి చేయాల్సినదంతా చేయాలి: సీఎం
*ఉగాది నాటికి ఇళ్ళపట్టాలుః*
ఉగాదినాటికి ఇళ్లపట్టాల పంపిణీపైనా కూడా సీఎం సమీక్ష
ఇప్పటివరకూ 17,34,817 మంది లబ్దిదారుల గుర్తింపు
మిగిలిన దరఖాస్తుల పరిశీలన కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్న అధికారులు
గ్రామాల వారీగా జాబితాను తయారు చేయాలన్న సీఎం
ఈ జాబితాను గ్రామ సచివాలయాల బోర్డుల్లో ఉంచాలన్న సీఎం
పట్టా ఇవ్వడమే కాదు, ఆ భూమి ఎక్కడుందో లబ్ధిదారునికి చూపించాలి:
దేశంలో ఎప్పుడూ, ఎక్కడా కూడా ఈస్థాయిలో ఇళ్లపట్టాలను పంపిణీచేయలేదు:
ఈ కార్యక్రమాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది:
ఇంట్లో మహిళ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి:
*రైతు భరోసా*
రైతు భరోసామీద కూడా సీఎం సమీక్ష
అక్టోబరు 5న గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా ఉంచేందుకు ప్రయత్నించాలన్న సీఎం
అక్టోబరు 8న తుది జాబితాను వ్యవసాయశాఖకు పంపాలన్న సీఎం
కౌలు రైతులకు సాగు హక్కు పత్రంపై రైతుల్లో అవగాహన పెంచాలి: సీఎం
రైతుల్లో చైతన్యం నింపాల్సిన అవసరం ఉంది: సీఎం
*ఇసుక లభ్యతపై సమీక్ష ః*
స్పందన కార్యక్రమం సమీక్షలో ఇసుక సమస్యపై కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి
ఇసుక రవాణా చేస్తామంటూ నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని తీసుకోండి : సీఎం
కిలోమీటర్‌కు రూ.4.90 ల చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణాకోసం వారి వాహనాలను వాడుకోండి: సీఎం
రాష్ట్రంలోని అన్ని రీచ్‌లనూ ఓపెన్ చేయండి
జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలి
ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలి
ఈ సమస్యను తీవ్రంగా తీసుకోండి
వరదలు తగ్గాయి, ఇసుక లభ్యత ఉంది, తక్కువరేట్లకూ అందించాలి
సత్వరమే చురుగ్గా ఇసుకను అందించడానికి దృష్టిపెట్టాలి:
రైతులు భూముల్లో ఇసుక ధర రూ.60 నుంచి రూ.100లకూ పెంచినా అభ్యంతరం లేదు:
వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలి:
వరదలు కారణంగా ఇసుక తరలింపు సాధ్యంకావడంలేదంటున్న కలెక్టర్లు
ప్రతిజిల్లాలోని 2 వేలమంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్ కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలని సీఎం
వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు ఇచ్చేలా చూడాలన్న సీఎం
దీనిపై మార్గదర్శకాలు తయారుచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
ఇదే సమయంలో ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలని సీఎం ఆదేశాలు
కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశం
రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనమతించరాదని సీఎం ఆదేశం
గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా కచ్చితంగా కనిపించాలి: సీఎం
ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు:
దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు :
ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను:
మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదు:
చెక్‌పోస్టుల్లో గట్టి నిఘాను పెంచండి: సీఎం
ఇప్పటికే రాష్ట్రంలో అవసరాలకు తగిన ఇసుక లేదన్న విషయం గుర్తించండి:
అధికారులు అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలి: