రేపు సీఎం ఢిల్లీ పర్యటన

20–10–2019
అమరావతి


రేపు సీఎం ఢిల్లీ పర్యటన
*మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి*
*రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో చర్చలు*


అమరావతి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రిసహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకుంటారు. రేపు మధ్యాహ్నం 1 గంటలకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోనే బసచేయనున్నారు. 22వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విశాఖపట్నం చేరుకుని,  సాయిప్రియా రిసార్ట్స్‌లో అరుకు ఎంపీ జి. మాధవి, శివప్రసాద్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం అదేరోజు రాత్రి తాడేపల్లి చేరుకుంటారు. 


*రేపు ఉదయం పోలీసు సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గోనున్న సీఎం*


రేపు ఉదయం 8 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి ముఖ్యంమంత్రి హాజరుకానున్నారు. అమరులైన పోలీసులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించనున్నారు.