హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం
         విజయవాడ:                   రాష్ట హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ హరిచందన్, జస్టిస్‌ జేకే మహేశ్వరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. హైకోర్టుకు చెందిన న్యాయవాదులు, అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.