గేమ్స్‌ ఆడే ఔత్సాహికుల‌కు ఏఎండీ గేమ్ ఆన్ గొప్ప వ‌రం

గేమ్స్‌ ఆడే ఔత్సాహికుల‌కు
ఏఎండీ గేమ్ ఆన్ గొప్ప వ‌రం
తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్‌
అమరావతి : గేమ్స్ ఆడే ఔత్సాహికుల‌కు ఏఎండీ గేమ్ ఆన్ గొప్ప వ‌రం అని తెలంగాణా ప్ర‌భుత్వ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లోని హైటెక్స్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో వ‌ర‌స‌గా నాలుగో ఏడాది గేమ్ ఆన్ పేరుతో ఏఎండీ గేమింగ్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించింది. ఈ టోర్న‌మెంట్‌ను జ‌యేష్ రంజ‌న్‌తో పాటు హైద‌రాబాద్ యూఎస్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ జోయ‌ల్ రైఫ‌మ‌న్‌, ఏఎండీ కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూస్ జెడ్రాకోవిక్‌లు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌యేష్ మాట్లాడుతూ యానిమేష‌న్‌, గేమింగ్, విఎఫ్ఎక్స్‌, మ‌ల్టీమీడియా ప‌రిశ్ర‌మ గ‌త ఏడాది హైద‌రాబాద్‌లో 14 వృద్ధి చెందింద‌న్నారు. ఏఎండీ లాంటి కంపెనీలు హైద‌రాబాద్ రావ‌డం వ‌ల్ల ఈ వృద్ధి దేశంలోనే అత్య‌ధికంగా ఉంద‌న్నారు. కొత్త సాంకేతిక ఆవిష్క‌ర‌ణ‌లతో మార్కెట్ విస్తారంగా దూసుకుపోతుంద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌తో పాటు గేమ్స్ సీరియ‌స్‌గా ఆడేవారికి ఈ వేడుక ఆకర్షిస్తోంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేద‌న్నారు. ఈ గేమింగ్‌తో గొప్ప ఉపాధి అవ‌కాశాలు లభిస్తాయ‌ని పేర్కొన్నారు.
ఏఎండీ సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూస్ జెడ్రాకోవిక్ మాట్లాడుతూ భార‌తదేశంలో గేమింగ్ ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేయ‌డానికి ఏఎండీ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. మిగిలిన వేడుక‌ల వ‌లే కాకుండా ఈ కార్య‌క్ర‌మాన్ని మా ఇంజ‌నీర్లే నెల‌కొల్పార‌న్నారు. మా ఇంజ‌నీర్లు అభివృద్ధి చేసిన హ‌ర్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల‌ను గేమ్స్ ఆడేవారికి, ఉత్సాహ‌వంతులైన ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని తెలిపారు. ఈ రోజు 400 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు గేమ్ ఆన్‌లో ఉన్నార‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చే సంద‌ర్శ‌కులు త‌ప్ప‌కుండా కొత్త అనుభూతిని పొందుతార‌ని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల కోసం 56 టీమ్‌లు, 600 మంది గేమ్ ఆడేవారు రిజ‌స్ట‌ర్ చేసుకున్నారని వివ‌రించారు. ఈ పోటీల్లో పాల్గొనే విజేల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా రూ.20 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌హుమ‌తులు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. ల‌క్కీ విన్న‌ర్.. ఏఎండీ ఇంజ‌నీర్లు త‌యారు చేసిన‌ రైజ‌న్ 7.3700ఎక్స్‌, రెడీ ఆన్ ఆర్ఎక్స్‌5700ఎక్స్‌టీ ల‌ను ఉప‌యోగించి రూపొందించిన గేమింగ్ రిగ్‌ను ఇంటికి తీసుకెళ్ల‌వ‌చ్చున‌ని తెలిపారు.
ఏఎండీ రైజ‌న్ ప్రాసెస‌ర్స్‌, ఏఎండీ రేడియ‌న్ గ్రాఫిక్ కార్డ‌ల‌తో సంద‌ర్శ‌కులు కూడా రిగ్స్‌పై గేమ్స్ ఆడ‌వ‌చ్చున‌ని తెలిపారు. దీనిలో ఉద్యోగ అవ‌కాశాల‌కు ఎవ‌రైనా రెజ్యూమ్ పంప‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. మ‌రింత స‌మాచారం కోసం www.amdgameon.com లో సంప్ర‌దించాల‌ని కోరారు.