శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం.

శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం...
విజయవాడ: ఇంద్ర‌కీలాద్రి: శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 6వ రోజైన శుక్ర‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ ష‌ష్ఠి) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. జ‌గ‌జ్జ‌న‌నీ అయిన శ్రీమ‌హాల‌క్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భ‌క్తుల‌ను సాక్షాత్క‌రిస్తుంది. *యాదేవీ స‌ర్వభూతేషు ల‌క్ష్మీరూపేణ సంస్థితా* అంటే స‌మ‌స్త జీవుల్లోనూ ఉండే ల‌క్ష్మీ స్వ‌రూపం దుర్గాదేవి ... అని చండీ స‌ప్త‌శ‌తి చెబుతోంది. కాబ‌ట్టి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆ త‌ల్లి స‌ర్వ‌మంగ‌ళ కారిణిగా ధ‌న‌, ధాన్య‌, ధైర్య‌, విజ‌య‌, విద్య‌, సౌభాగ్య‌, సంతాన భాగ్యాల‌ను ప్ర‌సాదిస్తుంది. శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిచ్చే క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నైవేద్యంగా పంచభోగాలైన పాయ‌సం, చ‌క్ర‌పొంగ‌లి, ల‌డ్డు, పులిహోర‌, ద‌ద్యోజ‌నాల‌ను నివేదిస్తారు.


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
అంబెడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ysrcp నేత దేవినేని ఆవినాష్
Image
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.