ప్రతి పనికి రివర్స్ టెండరింగ్ సాధ్యం కాదు: మంత్రి బొత్స

ప్రతి పనికి రివర్స్ టెండరింగ్ సాధ్యం కాదు: మంత్రి బొత్స
గుంటూరు.  అక్టోబర్ 26 (అంతిమతీర్పు)  : ప్రతి పనికి రివర్స్ టెండరింగ్ సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నేడు ఆయన మంత్రి మోపిదేవితో కలిసి గుంటూరు కార్పొరేషన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. భూగర్భ డ్రైనేజీకి రూ.391 కోట్లు ఖర్చు చేసినా.. ఆ మేరకు పనులు జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. నవంబర్‌తో పనుల గడువు పూర్తయినప్పటికీ పనులు మాత్రం.. 50 శాతమే పూర్తయ్యాయన్నారు. కాంట్రాక్టర్లను మార్చాలనే ఆలోచన తమకు లేదన్నారు. బీఆర్ స్టేడియం పరిస్థితి దారుణంగా ఉందని.. గత ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏం చేశారు? అని బొత్స ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా పనులు అప్పజెప్పారురని ఆరోపించారు.