జ్ఞానపీఠ్” అవార్డ్ గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ వర్దంతి. (అక్టోబర్ 18)

“జ్ఞానపీఠ్” అవార్డ్ గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ వర్దంతి. (అక్టోబర్ 18)


ఇరవైయవ శతాబ్దపు ప్రధమ శ్రేణి కవుల్లో అగ్రగణ్యులు, నన్నయ్య, తిక్కన్నలు ఆవహించి న సంప్రదాయ కవీంద్రుడు, వర్ణాశ్రమ ధర్మ సంరక్షణా దురంధరుడు, సమకాలీన సమాజ రీతులలో రాజీపడని ఛాందసుడు, కవిసామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ  గారు కృష్ణా జిల్లా నందమూరు లో 1895 సెప్టెంబర్ 10 న  జన్మించారు. కాలేజ్ చదువు మచిలీపట్నం జాతీయ కళాశాలలో పూర్తిచేశారు. తరువాత 1929లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృత భాషలో మాస్టర్ డిగ్రీ పొందారు. మచిలీపట్నంలో చదివే రోజుల్లో చెళ్లపిళ్ల వెంకట శాస్త్రీ, పింగళి లక్ష్మీ కాంతం, కాటూరి వెంకటేశ్వర రావు వంటి కవుల ప్రభావం వీరిపై పడింది. తెలుగువారు గర్వించదగ్గ వీరు 14 ఏళ్లకే సాహితీ వ్యవసాయం ప్రారంభించిన వీరు అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేశారు. వీరు తన బహుముఖ ప్రజ్ఞ తో పద్యాలు, నవలలు, నాటకాలు, కథలు, చరిత్ర, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషా శాస్త్రం మొదలైన ఎన్నో విషయాలను స్పృశిస్తూ రచనలు చేశారు.సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వీరి రచనలు ప్రతిబింబాలు. పద్మశ్రీ, కళాప్రపూర్ణ, పద్మ విభూషన్ లాంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేసారు. 'కాలానికేదురీదిన వాడ....తాటిపట్టేకు ఎదురు దేకెడు వాడనే' నని స గర్వంగా చెప్పుకున్న కవి. వేదములలోని, వేదాంగములలోని విమలార్ధచయం వాదించు నా కవిత....వాని శత్రువై వరలు నీ జగము' అంటూ తనకూ, సమకాలీన సమాజానికి ఉన్న పేచీని స్పష్టంగా చెప్పిన నిష్కపటి విశ్వనాథ వారు. ఆంధ్ర పౌరుషము, కిన్నెరసాని పాటలు, ఏకవీర, కడిమి చెట్టు వంటి లఘు రచనలు చేసినా వేయి పడగలు, రామాయణ కల్పవృక్షం వంటి భారీ రచనతో బహుముఖమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. మండే కొరివి లాంటి ఆయన మెథస్సుకు, రచన ఒక ఇంధనంగా మారింది. 'వెలుగు చీకట్లు రెండింట్లో అందసగమందు సగముంటి నేను' అన్నాడు. తెలుగులో కవులెవరూ వాల్మీకి రామాయణానికి న్యాయం చేయలేదని రామాయణ కల్పవృక్షం రచనకు పూనుకున్నారు. రామాయణ శిల్ప రహస్యాలను, ఆయన కల్పక ప్రసూనాలను కళ్లకద్దుకున్నారు. ఆయన రచించిన 'మాస్వామి' శతకాన్ని దూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం తో సమానంగా మన్నిస్తారు. తన మాతృభాష నానా దుష్ట భాషల జాద్దత్యమును తలదాల్చవలసి వస్తుందని విచారించారు. పాశ్చాత్య సంస్కృతి, భారతీయ సంస్కృతిని రూపుమాపుతుందని ఘోషించారు. అన్నివిధాలా బానిసై పోతున్న జాతిని చూసి ఆవేదన పొందారు. ఆర్తి మాత్రమే ఆయన్ను గొప్ప కవిగా, రచయితగా చేసింది. విశ్వనాథ వారి మనస్సు, శరీరం నిరంతరం సృజనశీలత కలిగినవి. కవిత్వాన్ని ఒక యోగంగా భావించిన విశ్వనాథ వారు సంస్కృత అధ్యాపకులుగా కరీంనగర్ డిగ్రీ కళాశాలలో కూడా పనిచేసారు. ఆయన సాహిత్య సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1971లో  జ్ఞానపీఠ పురస్కారంతో గౌరవించింది. ఈ గౌరవాన్ని తొలిసారిగా అందుకున్న తెలుగుకవి విశ్వనాథ వారే. కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలు విశిష్ట పురస్కారాలతో గౌరవించాయి. ప్రజలు గజారోహనలు చేయించారు. ఆయన రచనల మీద 60 పి హెచ్ డి లు, ఎం ఫీల్ డిగ్రీలొచ్చాయి. ఇందులో ఏవి ఆయనకన్నా గొప్పకాదు. నేను 'మనస్తన్యాసి' అంటూ లోకరీతి మీద అనాసక్తి ప్రదర్శించారు.  తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలతో కలిపి దాదాపు 250 రచనలు చేశారు. వీరి ఏకవీర తెలుగు సినిమాగా రూపుదిద్దుకుంది. వీరి వేయిపడగలు 'సహస్ర ఫన్' పేరున మాజీ ప్రధాని పి వి నరసింహారావు హిందీ అనువాదం చేశారు. సాహితీ వినీలాకాశంలో ధ్రువ తారగా భాసిల్లిన విశ్వనాథ వారు అక్టోబర్ 18,1976 న అనంతలోకాలకు వెళ్లిపోయారు.


(డా.జె.వి ప్రమోద్ కుమార్


పైడిమెట్ట, 9490833108.)


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image