ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్, ఆ మేరకు చర్యలు : సీఎం   జగన్‌ ఆదేశం

*11–10–2019*
*అమరావతి*


*ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్, ఆ మేరకు చర్యలు : సీఎం  శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశం*


*ఎంపిక చేసిన15–20 పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్ధలతో అభివృద్ధి: సీఎం*


*పూర్తి స్ధాయి ప్రాజెక్టు రిపోర్టు సమర్పించండి : సీఎం*


*రాష్ట్రంలో అరుదైన హస్తకళల పరిరక్షణకు ఆదేశాలు*


*ఏటికొప్పాక, కొండపల్లి,కంళంకారీ తదితర అరుదైన కళాకారులకు ఆర్థిక సాయం*


*కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి : సీఎం ఆదేశం* 
*రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి నిర్వహణకు ఆర్కియాలజీ కార్పొరేషన్‌  : సీఎం గ్రీన్‌ సిగ్నల్‌* 
*విశాఖపట్నం,అమరావతి,తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా సముదాయాలకు అధికారుల ప్రతిపాదనలు : సీఎం గ్రీన్‌ సిగ్నల్‌*
*ప్రతీ జిల్లాలో క్రీడా సముదాయాల ఉండేలా చూడండి : సీఎం*
*ప్రతీ జిల్లాలో కల్చరల్‌ అకాడమీల ఏర్పాటు : సీఎం అదేశం*


అమరావతి: ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రముఖస్థానం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్టంలో సుమారు 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్‌స్టార్‌ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, యూత్‌ ఎఫైర్స్‌ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. టూరిజంతోపాటు చారిత్రక ప్రాంతాల అభివృద్ధి, అన్ని జిల్లాల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.., భారతదేశంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్‌ రాష్ట్రాన్ని ఎంపికచేసుకుంటున్నారని, అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణమని అన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసిన తనకు వివరాలు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆతిథ్యరంగంలో, పర్యాటక రంగంలో అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేట్టు ఇక్కడ ఉత్తమ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై సహజంగానే అంతర్జాతీయస్థాయిలో మంచి ప్రచారం లభిస్తుందన్నారు. అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత వాటి మార్కెటింగ్‌ చేయడంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ఇదే సమయంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, 
సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు. పూర్తిస్థాయి వివరాలతో తనకు మళ్లీ సమాచారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్‌ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అక్కడ నదికి అడ్డంగా గ్లాస్‌తో ఒక వంతెన కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నామని, పలు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు వివరించారు. తనకు సమర్పించే నివేదికలో ఈప్రతిపాదనలు అన్నింటినీ చేర్చాలని సీఎం సూచించారు. పోలవరం, పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతోపాటు,  విశాఖజిల్లాలో అరుకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో  టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 
విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటుకు రక్షణశాఖ అధికారులు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సమావేశంలో వెల్లడించారు. ఏపీటీడీసీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో హోటళ్లను, రిసార్టులను నిర్వహిస్తోందని, అయితే చాలారోజులగా నిర్వహణకోసం కనీస నిధులు కూడా ఇవ్వకపోవడంతో సమస్యలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే వీటి మరమ్మత్తులు చేపట్టి, నిర్వహణ మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు.


రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా వారిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.  అరుదైన హస్తకళల్లో నైపుణ్యం కలిగిన ఏటికొప్పాక, కొండపల్లి, కంళంకారీ తదితర కళాకారులును ఆదుకునే దిశగా  కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేసుల తయారీ, కళంకారీ తదితర అరుదైన హస్తకళలు చేస్తున్న  కుటుంబాలవారికి  సహాయం చేసేలా మార్గదర్శకాలు తయారుచేయాలన్నారు. లేకపోతే ఆ కళలు బతకవని, వాటిని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. 


అలాగే రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి ఆర్కియాలజీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. 


గోదావరిలో మరలా బోట్లను తిప్పడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. నదీతీరాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుపై  ఈ సందర్భంగా సీఎం ఆరాతీశారు. 
నిర్దిష్టమైన నిర్వహణా పద్ధతులు, కంట్రోల్‌ రూమ్స్‌ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పర్యాటకులు,ప్రయాణికులకు సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఏర్పాటైన  కమిటీ నివేదిక రాగానే సిఫార్సులపై చర్చిద్దామని సీఎం చెప్పారు. 
శిల్పారామాల్లో ప్రస్తుత పరిస్థితిపైనా సీఎం సమీక్ష చేశారు. ప్రస్తుతం ఉన్న శిల్పారామాల అభివృద్ధి, వాటిలో గ్రీనరీని పెంచడంపై సీఎం అధికారులకు సూచించారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బందిలేకుండా విధానాన్ని తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.


ప్రతిజిల్లాలో కల్చరల్‌ అకాడమీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. కనీసం ఐదెకరాల స్థలంలో ఈ అకాడమీలను నిర్మించాలని, రెండేళ్లలోగా వీటిని పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్‌ అకాడమీలు వేదిక కావాలన్నారు. మన కళలను, సంస్కృతిని నిలుపుకోవడానికి, వాటి ప్రాముఖ్యత పెంచడానికి ఈ అకాడమీలు ఉపయోగపతాయని సీఎం అన్నారు. సంగీత, నృత్యకళాశాలలో బోధిస్తున్న వారికి పార్ట్‌టైం, ఫుల్‌టైం వారికి జీతాలు పెంచాలని కూడా సీఎం ఆదేశించారు.  


*జిల్లాకో క్రీడా సముదాయం* 
రాష్ట్రంలో క్రీడలు, సదుపాయాలపైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్షించారు. ప్రతిస్కూళ్లో క్రీడల కోసం మైదానం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లకు ప్లే గ్రౌండ్స్‌ ఉన్నాయి, ఎన్నింటికి సమాకూర్చాలన్న దానిపై నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. అలాగే ఉన్న ఆటస్థలాల అభివృద్దిపైకూడా కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. అలాగే ఫిజికల్‌ ట్రైనర్లు ఉన్నారా? లేదా? అనేదానిపై కూడా పరిశీలనచేసి, నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు.


విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణంపై సమావేశంలో చర్చ జరిగింది. అంతర్జాతీయ సదుపాయాలతో స్టేడియంల నిర్మాణానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిజిల్లాలో కూడా ఒక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఉండాలని వీటికి ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని స్పష్టంచేశారు.  ప్రతి జిల్లాలో కూడా క్రీడా సముదాయాల కారణంగా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఏవిధంగా ప్రోత్సహించాలి, వారికి ఎలా అండగా నిలబడాలన్నదానిపై కూడా ప్రతిపానదలు తయారుచేయాలని సీఎం ఆదేశించారు. గడచిన ఐదేళ్లలో జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన గతంలో ఎప్పుడూ చేయలేదని, ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం చెప్పారు.  ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఆ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image