విజయవాడ : అక్టోబర్ , 4 .2019.
అమ్మవారి కరుణా కటాక్షాలు , దీవెనలతో రాష్ట్రంలోని ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు .
శుక్రవారం ఉదయం అమ్మవారిని సతీసమేతంగా బొత్స సత్యన్నారాయణ దంపతులు దర్శించుకున్నారు . ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం . వి . సురేష్ బాబు మంత్రి బొత్స సత్యన్నారాయణ, ఝాన్సీ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికి , అమ్మవారి ప్రసాదాన్ని , చిత్రపటాన్ని అందజేశారు .
అనంతరం మంత్రి బొత్స సత్యన్నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున భక్త్తులు అమ్మవారి దర్శనం కోసం ఉదయం రావడం జరిగిందన్నారు . రాష్ట్రంలోని ప్రజలకు అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకున్నామన్నారు . భక్తులందరూ అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు . అమ్మవారి కరుణా కటాక్షాలతో రాష్ట్రంలో వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉందన్నారు . అమ్మవారి ఆశీస్సులు భక్తులకు పొందాలని ఆశిస్తున్నామన్నారు .
శరన్నవరాత్రులలో 6వ రోజైన శుక్రవారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర మత్స్యశాఖ , పశుసంవర్ధకశాఖ మాత్యులు మోపిదేవి వెంకట రమణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీమహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు .