గేట్‌వే హోట‌ల్‌లో మింగ్ గార్డెన్ ఫుడ్ ఫెస్టివల్

గేట్‌వే హోట‌ల్‌లో మింగ్ గార్డెన్ ఫుడ్ ఫెస్టివల్


సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌:  భోజ‌న‌ప్రియుల కోరిక మేర‌కు నోరూరించే వెజ్, నాన్‌వెజ్ వంట‌కాల‌తో మింగ్ గార్డెన్ ఫుడ్ ఫెస్టివ‌ల్ శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీరోడ్డులోని హోట‌ల్ గేట్‌వే ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజర్ ఎస్.వి.రమణమూర్తి, సేల్స్ అసిస్టెంట్ కూరాకుల గోపి చెప్పారు. శుక్రవారం హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయా వంట రుచుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గోపి మాట్లాడుతూ బే లీఫ్ రెస్టారెంట్‌లో ప్ర‌తిరోజూ డిన్న‌ర్ కోసం ఈ ఫెస్టివ‌ల్ అందుబాటులో ఉంటుంద‌న్నారు. స్నేహితులు, కుటుంబ‌స‌భ్యులు క‌లిసి రాత్రి డిన్న‌ర్ చేసేలా క్వాలిటీ వంట‌కాల‌ను మాస్ట‌ర్ చెఫ్ సెబాస్టియ‌న్ నేతృత్వంలో ఎగ్జిక్యూటీవ్ చెఫ్ శ్రీధ‌ర్‌, చెఫ్ బ్ర‌హ్మాజీ త‌యారుచేయ‌నున్న‌ట్లు తెలిపారు. నాన్‌వెజ్ వంట‌కాల్లో కాంజీ క్రిస్పీ లంబ్‌, బ‌ట‌ర్ గార్లిక్స్‌, రొయ్య‌లు, స్లైస్ ఫిష్‌, జింజ‌ర్ సిసెమ్‌ల‌తో పాటు వెజిటేరియ‌న్ వంట‌కాల్లో వాట‌ర్ బెస్ట్‌న‌ట్ టోపుహ‌ని, చిల్లీ, క్రిస్పీ హ‌నీ చిల్లీ అందుబాటులో ఉంటాయ‌న్నారు. వీటితో పాటు సీ ఫుడ్స్‌, ఫౌల్ట్రీ, మీట్స్‌, వెజిటేరియ‌న్స్‌, రైస్‌, చికెన్ అండ్ ఎగ్ నూడిల్స్‌, సింగ‌పూర్ రైస్ నూడిల్స్‌, ఫెడ్ చాకోలేట్ మామోస్‌, డేట్స్ అండ్ న‌ట్స్ వంటి అనేక నోరూరించే వంట‌కాలు ఫెస్టివ‌ల్‌లో కొలువుదీర‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయా వంట‌కాల‌ను ప్ర‌ద‌ర్శించారు.