మోడీ తో కేసీఆర్ భేటీ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై 50 నిమిషాల పాటు చర్చించారు. 22 అంశాలకు సంబంధించి లేఖలు అందచేశారు. ఈ లేఖల్లో విజ్ఞప్తులు ఇలా ఉన్నాయి. 
- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ.450 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. గత ఐదేళ్లలో నాలుగు సార్లు విడుదలయినప్పటికీ, ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలి. 
- నేషనల్ హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి. 
- తెలంగాణ హైకోర్టులో జడ్డిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి.
- తెలంగాణలో ఐఐఎంను నెలకొల్పాలి. 
- తెలంగాణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) మంజూరు చేయాలి. 
- హైదరాబాద్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి.)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ లో నెలకొల్పాలని ప్రతిపాదించిన ఎన్.ఐ.డి.ని రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు. 
- అన్ని జిల్లాల్లో నవోదయ విద్యలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు తెలంగాణలో మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
- రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులు విడుదల చేయాలి
- నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయ పథకానికి రూ.5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి.
- బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
- జహీరాబాద్ నిమ్జ్ కు నిధులు విడుదల చేయాలి.
- తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు, రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
- పిపిపి పద్ధతిలో కరీంనగర్ లో ఐఐఐటి నెలకొల్పాలి
- తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బిసిలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, రిజర్వేషన్లు కల్పించాలి
- పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
- హైదరాబాద్ – నాగపూర్, వరంగల్ – హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి పరచాలి
- వెనుక బడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం పి.ఎం.జి.ఎస్.వై. ద్వారా 4వేల కోట్ల రూపాయలు కేటాయించాలి
- వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా, వందశాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి
- సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి
- వరంగల్ టెక్స్ టైల్ పార్కు కోస వెయ్యి కోట్ల రూపాయలను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా అందించాలి
- రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి
- వరద కాలువకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మద్యాహ్నం హోం మంత్రి అమిత్ షాను, సాంయంత్రం రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ను కూడా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image