తీవ్రంగా ఖండన

..
 తూర్పుగోదావరి జిల్లా తుని మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాతా సత్యనారాయణ ను దుండగులు దారికాచి  దారుణంగా హత్య చేసి చంపడాన్ని ఎడిటర్స్ & జర్నలిస్టు అధ్యక్షులు పఠాన్ హనీఫ్ ఖాన్, కార్యదర్శి బట్టు బాలాజీ రావు,షేక్ ఖలీఫాతుల్లా బాషా,మన్నం మాధవరావు, అంగలకుర్తి ప్రసాద్, మిట్నసల బెంజమిన్, దాసరి వెంకట రామారావు, మంకాల రామకృష్ణ, షేక్ కరిముల్లాలు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులుగా తమ వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తున్న వారిపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని దాడులు చేస్తూ చివరికి హత్యలు చేసే స్థాయికి దుండగులు పూనుకోవడం దుర్మార్గకర చర్యగా అభివర్ణించారు. ఈ సంఘటన   ద్వారా రాష్ట్రంలో జర్నలిస్టులకు భద్రత కరువైందని,శాంతి భద్రతలు ప్రశ్నార్ధకంగా మారాయని తేటతెల్లం అయిందని తెలిపారు. గతంలోనే  సత్యనారాయణ తన మీద  జరిగిన దాడి గురించి  చేసిన ఫిర్యాదును  పోలీసులు సీరియస్ గా భావించి  దుండగులపై కఠిన చర్యలు తీసుకొనివుంటే ఈరోజు జర్నలిస్టు సత్యనారాయణ హత్యకు గురికాకుండా వుండేవాడని తెలిపారు.జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి  చట్టపరమైన గట్టి చర్యలు తీసుకోవాలని, చనిపోయిన జర్నలిస్టు సత్యనారాయణ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.