రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం గర్వకారణం : డిప్యూటీ సీఎం

రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం గర్వకారణం : డిప్యూటీ సీఎం
విజయవాడ : ముస్లింలు అందరూ ఒక్కటే అనే భావాన్ని అందరిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ముస్లిమ్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాత్ బాషా అన్నారు. శనివారం ఆల్ ఇండియా ముస్లిమ్స్ కౌన్సిల్ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా అంజాత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి 27 రాష్ట్రాల నుంచి ఖాజీలు రావడం మంచి పరిణామం అన్నారు. ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ కార్యక్రమాలను 1992లో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో ముస్లిం అందరూ ఒక మాట మీద ఉండి.. వారి సమస్యలను తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా ముస్లింలు అంతా కట్టుబడి ఉండటం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ముస్లింలకు సంబంధించి షరియాను ప్రతి ముస్లిం తూచా తప్పకుండా పాటించడం జరుగుతుందన్నారు.