అటువంటి మహా నటుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం

*ప.గో...జిల్లా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ చేసిన మెగాస్టార్ చిరంజీవి*


గత సంవత్సరం నుంచి ఎస్వీ రంగారావు విగ్రహం ఆవిష్కరించాలని నన్ను కోరారు


అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు


ఇన్నాళ్లకు నేను అభిమానించే ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం నా అదృష్టం


నా తండ్రి గారికి రంగారావు జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు యాక్ట్ చేసే అవకాశం వచ్చింది


ఎస్వీఆర్ లో అలవోకగా మాట్లాడటమే ఆయన ప్రత్యేకత


ఆయనను చూసే నాకు నటన పట్ల మక్కువ కలిగింది


నేను సినిమాల్లోకి రావడానికి ఆయనే స్ఫూర్తి


అటువంటి మహా నటుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం


ఆయన నటనకు హద్దులు లేవు ఆయన అంతర్జాతీయ నటుడు


అలాంటి మహానుభావుడు విగ్రహం ఇక్కడ పెట్టడం ఆనందదాయకం


నా జిల్లాకు వచ్చాను నన్ను ఆదరిస్తున్నారు, అక్కున చేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలుసైరా చిత్రాన్ని ఆదరించిన విజయం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు


నేనొస్తున్నని తెలిసి ఎండను సైతం లెక్కచేయకుండా ఇక్కడకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు


మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి