నేను స్వయంగా మీ ఇంటికి వస్తా.. మరి చర్చకు సిద్ధమా ?

26 అక్టోబరు, 2019
తాడేపల్లి, విజయవాడ


నేను స్వయంగా మీ ఇంటికి వస్తా.. మరి చర్చకు సిద్ధమా ?
వర్ల రామయ్య సవాల్‌ స్వీకరిస్తున్నాం.. ప్రతి సవాల్‌ చేసిన ఎమ్యెల్యే సుధాకర్‌బాబు
ఒకరోజు ఢిల్లీ ధర్మ పోరాటదీక్షకు రూ.10 కోట్లు ఇస్తూ జీవో ఇచ్చారా.. లేదా..
మీరు, చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
సూటిగా నిలదీసిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే 
ధర్మ పోరాట దీక్షలకు ప్రజాధనం దుర్వినియోగం- దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేశారు
దీనిపై విచారణ జరపాలని సీఎంను కోరుతున్నాం
వెల్లడించిన ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు


 ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షకు అప్పటి ప్రభుత్వం రూ.10 కోట్లు ఖర్చు చేసిందని, కానీ టీడీపీ నాయకులు మాత్రం కేవలం కోటి మాత్రమే ఖర్చయ్యాయని చెబుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. ఈ విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన సవాల్‌ స్వీకరిస్తున్నామని ఆయన ప్రకటించారు. అయితే ఇందు కోసం వర్ల రామయ్య సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని, తాను స్వయంగా ఆయన ఇంటికి వెళ్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. మరి చర్చకు వర్ల రామయ్య సిద్ధంగా ఉన్నారా? అని ప్రతి సవాల్‌ చేశారు.  
 ఢిల్లీ ధర్మ పోరాట దీక్షకు టీడీపీ ప్రభుత్వం నాడు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు రుజువు చేస్తామని, అప్పుడు చంద్రబాబుతో పాటు, వర్ల రామయ్య రాజకీయాల నుంచి వైదొలగుతారా? అని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు నిలదీశారు. ఒకవేళ తాను ఆ విషయాన్ని రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
 ధర్మపోరాట దీక్షల పేరుతో టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసిందని, దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసిందని, దీనిపై విచారణ జరపాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతున్నామని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు చెప్పారు.
అన్యాయంగా అక్రమంగా దొంగ సవాల్‌
 టీడీపీ నేత వర్ల రామయ్య చాలా అన్యాయంగా, అక్రమంగా ఒక దొంగ సవాల్‌ విసిరారని, ఆ సవాల్‌ను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వీకరిస్తోందని శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు వెల్లడించారు. 
 చంద్రబాబు నాయకత్వంలో ఢిల్లీలో ఫిబ్రవరి 11, 2019న ధర్మ పోరాట దీక్ష జరిగిందని, దాని కోసం రూ.10 కోట్లు కేటాయిస్తూ జీఓ నెం.215 జారీ చేశారని, ఆ జీఓను గతంలో కూడా చూపామని, ఇప్పుడు మళ్లీ మీడియా ముందు ఉంచుతున్నామని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తెలిపారు. అయితే ఆ దీక్షకు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని, దాన్ని నిరూపిస్తామని, సచివాలయానికి వస్తామని మంత్రి శ్రీ పేర్ని నాని మీద వర్ల రామయ్య అవాకులు చెవాకులు పేలారని గుర్తు చేశారు. 
దమ్ము, ఖలేజా ఉందా?
 'మీకు దమ్ముంటే, ఖలేజా ఉంటే, వర్ల రామయ్య.. నీవు సచివాలయానికి రా. ఈ ఒక్కటి చాలు.. మీరు గత 5 ఏళ్లుగా చేస్తున్న అసత్య ప్రచారాలకు, చాలా విషయాలను మభ్య పెడుతున్నారని చెప్పడానికి రుజువు.
టీడీపీ హయాంలో ప్రజాదనం దారుణంగా దుర్వినియోగమైంది. ఢిల్లీ ధర్మ పోరాట దీక్షకు రూ.10 కోట్లు కేటాయిస్తూ, జీఓ జారీ చేసి, కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని చెబుతున్నారు' అని వైయస్సార్‌సీపీ నేత పేర్కొన్నారు.
నేనే మీ ఇంటికి వస్తాను
 'మీరు సచివాలయానికి వస్తే ఇంకా సమస్యలు వస్తాయి కాబట్టి, ఈ జీఓ పట్టుకుని నేను స్వయంగా నీ ఇంటికి వస్తాను. మరి చర్చకు సిద్ధంగా ఉన్నారా?. ఢిల్లీ పోరాట దీక్షకు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు మేము రుజువు చేస్తాము. అలా చేస్తే నీవు, చంద్రబాబు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? ఒకవేళ మేము నిరూపించలేకపోతే నేను రాజీనామా చేస్తాను' అని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రకటించారు. 
ప్రజాధనం దుర్వినియోగం
 ధర్మ పోరాట దీక్షల కోసం ప్రతి జిల్లాకు తొలుత కోటి రూపాయల చొప్పున మంజూరు చేశారని, ఆ తర్వాత ఒక్కో జిల్లాలో రూ.3 కోట్లు ఖర్చు చేశారని, ఆ విధంగా మొత్తం 13 జిల్లాలకు రూ.39 కోట్లు, ఢిల్లీలో దీక్ష కోసం మరో రూ.10 కోట్లు మొత్తం రూ.49 కోట్లు ఖర్చు చేశారని సుధాకర్‌బాబు వెల్లడించారు.
ఎవరి కోసం?
 'మరి వాటి వల్ల కనీసం హోదా అయినా సాధించారా? దీక్షలన్నీ పసుపు, పసుపు చొక్కాల మయం. ఇది ప్రజల కోసం చేసిన పనా?
రాష్ట్రం కోసం చేసిన పనా? మేము ఇదే విషయాన్ని ఆరోజు ప్రశ్నిస్తే, మేము అభివృద్ధికి అడ్డు అని, మా నేత శ్రీ వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేశారు.
మీరు ఎక్కడ దీక్ష చేసినా చుట్టూ ఏసీలు, పరుపులు వినియోగించారు.
మీ ప్రచారం కోసం అలా రూ.50 కోట్లు ఖర్చు చేశారు'.
 'అందుకే వర్ల రామయ్య.. నేను స్వయంగా మీ ఇంటికి వస్తాను. 
సవాల్‌ స్వీకరించాము. మరి సిద్ధంగా ఉండు' అని సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు.
న్యాయమూర్తులూ తప్పుబట్టారు
 చంద్రబాబు ధర్మపోరాట దీక్షల కోసం చేసిన ఖర్చుపై ఒక సామాన్యుడు పిల్‌ వేస్తే, హైకోర్టు న్యాయమూర్తులు కూడా స్పందించారని, వారు నాటి ప్రభుత్వాన్ని తప్పుబట్టారని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అసలు ఏ చట్టం కింద నిధులు విడుదల చేశారని హైకోర్టు ప్రశ్నించిందని, ఆ వివరాలు ఆరా తీసిందని చెప్పారు.
నోరు అదుపులో పెట్టుకో
 అందుకే వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, నిజానికి చంద్రబాబు ఆయనకు ఏమీ ఇవ్వకపోయినా, పూర్తిగా పక్కన పెట్టినా పదే పదే మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. 
ఏ చర్చకైనా రెడీ
 'వర్ల రామయ్యా ఇకనైనా నోరు మూసుకో. మనం ఏది మాట్లాడినా నిజమే మాట్లాడుదాము. మేము ఏ అంశంలో అయినా ప్రత్యక్ష చర్చకు రెడీ.
హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు మీరు సమాధానం చెప్పండి. హైకోర్టుకు సమాధానం చెప్పండి' అని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.
విచారణ జరపాలని కోరుతున్నాం
 చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం చేసిన దీక్షల కోసం ఖర్చు చేసిన దాదాపు రూ.50 కోట్లపై విచారణ జరిపించాలని సామాన్య ప్రజల తరపున సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను కోరుతున్నామని సుధాకర్‌బాబు చెప్పారు.
అన్నీ కపట రాజకీయాలే
 మాట్లాడితే 40 ఏళ్ల రాజకీయం అనే చంద్రబాబువి అన్నీ కపట నాటకాలని, అది ఆయన నైజం అని ఎమ్మెల్యే ఆరోపించారు. 
 'రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన కాంగ్రెస్‌తో జత కట్టావు. కానీ ఏం సాధించావు? రాజధాని కోసం 40 వేల ఎకరాలు తీసుకున్నావు. ఆ రైతుల ఉసురు నీకు తగిలింది. రాజధానిలో కనీసం ఒక్కటైనా శాశ్వత నిర్మాణం ఉందా? ఏమైనా అభివృద్ధి చేశారా? కనీసం ఒక్క రోడ్డు అయినా నేరుగా అమరావతిలోకి రావడానికి నిర్మించారా? ఎందుకు ఇప్పటికీ కరకట్టపైనే ఆధారపడాల్సి వస్తోంది' అని సుధాకర్‌బాబు గుర్తు చేశారు.
 శాశ్వత నిర్మాణం జరిగే వరకు హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉండాలని బిల్లులో ఉన్నా, హడావిడిగా ఇక్కడికి తరలించారని, కానీ ఇవాళ అక్కడ ఏ మాత్రం కనీస సౌకర్యాలు లేవని, చివరకు టాయిలెట్లు కూడా లేవని, మంచినీళ్లు, టీ కూడా దొరకడం లేదని చెప్పారు. 
నిస్సిగ్గుగా లేఖ
 ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణకు లేఖ రాశారని అన్నారు. శ్రీ వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టి కేవలం 5 నెలలే అయిందని, అప్పటి నుంచే వర్షాలు కురుస్తున్నాయని గుర్తు చేశారు.
 'లేఖ రాసిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను రమ్మనండి. హైకోర్టుకు వెళ్లి చూద్దాం. కనీసం అక్కడ టాయిలెట్లు అయినా ఉన్నాయా? లేవా? చూద్దాం' అని వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు గట్టిగా సవాల్‌ చేశారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image