చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
అక్టోబర్‌ 04
పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ సి రామచంద్రయ్య ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ 
–చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
–పోరాడే శక్తి లోపించింది,వ్యూహాత్మకంగా నీపార్టీ ప్రజాప్రతినిధులను బిజేపిలోకి పంపి అదే గొప్పరాజకీయం అనుకుంటున్నావు.
–టిడిపినుంచి బిజేపిలోకి వెళ్లినవారు కోవర్ట్‌ లే.వాళ్లు ఈరోజు శుద్దులు చెబుతున్నారు.
–ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోడ్రైవర్లకు ఒక్కోక్కరికి పదివేల రూపాయలు లక్షా 74వేల మందికి ఇచ్చారు.అదికారంలోకి వచ్చిన నాలుగునెలల్లో  రెండు రోజులక్రితం లక్షా35 వేలమందికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
–ఈనెల 15 వతేదీన రాష్ట్రంలో ఉన్న రైతులు కౌలు రైతులకు 12,500 రూపాయలు వంతున ఇవ్వాలని జగన్‌ గారు నిర్ణయించారు.
–ఈనెల 10న కంటివెలుగు కిందఅందరికి కంటిపరీక్షలు చేయాలని నిర్ణయించారు.నవంబర్‌ 21న మత్సకారులకు,ఉగాదికి ఇళ్లస్దలాలు ఇవ్వాలని నిర్ణయించారు.
–ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది వీటివల్ల అర్దమవుతుంది.
–ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ పధకాలు అమలే మహాయజ్ఞంగా జగన్‌ గారు ముందుకు వెళ్తున్నారు.
–చంద్రబాబూ ప్రజాసమస్యలపై స్పందించు
–ఓడిపోయినా సంబంధం లేని అంశాలను గురించి మాట్లాడితే ప్రయోజనమేంటి చంద్రబాబూ..
–కనకదుర్గమ్మదేవాలయంలో,శ్రీకాళహస్తిలో క్షుద్రపూజలు చేయించింది నిజం కాదా?
–కనకదుర్గమ్మఆలయభూములను నీకిష్టమైన వారికి కట్టబెట్టింది వాస్తవం కాదా?కిరీటం పోయింది నీహయాంలో కాదా?
–తిరుమలలో శ్రీవైయస్‌ జగన్‌ సంతకం పెట్టారా లేదా అనేది వ్యక్తిగతం ప్రజలకు సంబంధించిన అంశం కాదు.స్వామిదగ్గరకు వెళ్లేవ్యక్తికి భక్తి ఉందాలేదా అనేదే ముఖ్యం.
–జగన్‌ గారు క్రైస్తవుడే ఇతర మతాలను గౌరవిస్తూ ఆలయమర్యాదలు ఫాలోఅవుతున్నారు.
–ఆలయమర్యాదలు పాటించారు కదా?తిరుపతే కాదు రాష్ట్రంలోని పెద్దఆలయాలను సందర్శించారు.రుషికేష్‌ కు వెళ్లారు.బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు ఇచ్చేందుకు వెళ్లారు.
–23 సీట్లతో ఉన్న చంద్రబాబు ఆలోచనాసరళిమార్చుకోకుండా,పరాజయం గురించి ఆలోచించకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారు.
–40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయప్రవర్తన ఛైల్డీష్‌ గాఉంది
–రాజకీయాలంటే ప్రజలకు సేవచేయడమే.
–సదావర్తిభూములు పెద్దస్కామ్,విజయవాడలో 40 ఆలయాలు పడగొట్టింది నిజంకాదా?
–తిరుమలలో పోటును తవ్వించినఘనత నీదే?
–ప్రజలకు సంక్షేమపధకాలను కష్టపడి అమలు చేస్తున్నారు.
–ఎందుకంటే ఆర్దికపరిస్దితి దివాళాతీయించి వెళ్లావు అయినా సంక్షేమపాలన శ్రీ వైయస్‌ జగన్‌ అందిస్తున్నారు.
–ప్రజలకు సంబంధించిన సంతకాలు ఉన్నాయి,డ్రాక్వారుణాలు,చేనేతరుణాలు,రైతురుణాలు,బ్యాంకులలో బంగారం అంతా తీయించి ఇస్తానని,20 లీటర్ల మినరల్‌ వాటర్‌ 2 రూపాయలకే ఇస్తానన్నావు,బెల్ట్‌ షాపులు రద్దు చేస్తానని చెప్పావు.
–సంతకాలు పెట్టి అమలు చేయకపోతే పబ్లిక్‌ ఇష్యూ.
–ప్రజలకు వాగ్దానాలు చేసి మోసం చేస్తే అది పబ్లిక్‌ ఇష్యూ.
–ఏమాత్రం ప్రజలకు సంబంధం లేని అంశాలపై స్పందించడం ఏంటి?
–సోషల్‌ మీడియాలో ఎవరో తన పార్టీ వారిపై పోస్ట్‌ లు పెట్టారని బూతులు చదివి వినిపించారు.
–సోషల్‌ మీడియా అనేది కీకారణ్యం,అనార్గనైజ్డ్‌ సెక్టార్‌ అందులో అభ్యంతరకరంగా పోస్టింగ్‌ లు పెడితే ఏ పార్టీ వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
–పచ్చిబూతులు చంద్రబాబు చదివి వినిపించడం దిగజారడమే.
–ఎవడో వల్గర్‌ పోస్టింగ్‌ పెడితే చదివి వినిపించడం తగునా,నీవు జంటిల్మన్‌ లా ప్రవర్తించావా?
–వ్యక్తుల నైతికతపై లేనిపోని దుష్ప్రచారం చేయడం –నీచసంస్కృతి.నీచసంస్కృతికి మర్రివిత్తనం లాంటి వాడు చంద్రబాబు.
–40  ఏళ్ల ఇండస్ట్రీ  అంటారు కదా ఆయన 40 ఏళ్ల విషవృక్షం.‡
–దీనికి కర్తకర్మక్రియ అన్నీ ఆయన ఆయన వర్గం.
–గాంధీ,నెహ్రూ,ఇందిరాగాంధీలపై నరేంద్రమోదివరకు చంద్రబాబు అత్యంతనీచమైన వ్యాఖ్యలు చేశావు.చివరకు తన పార్టీ ఫౌండర్‌ ఎన్టీఆర్‌ పైన కూడా ఇష్టం వచ్చినట్లు రాయించి ప్రింట్‌ చేయలేని పుకార్లు సృష్టించింది నీవు కాదా?
–ఏకంగా తనకు అనుకూలమైన డాక్టర్లతో పుస్తకాలు రాయించావు.పుకారుకు మారుపేరు చంద్రబాబు.
–గత10 సంవత్సరాలుగా శ్రీ వైయస్‌ జగన్‌ పై చేయించిన దుష్ప్రచారం చూస్తే అది వ్యక్తులుగా చేయించింది కాదు వ్యవస్దగా చేయించావు.
–ఒక వ్యక్తి అయితే ఓ ఆరోపణ చేస్తారు.కంటిన్యూస్‌ గా వ్యవస్దీకృతంగా చేశాడు చంద్రబాబు.కుటుంబసభ్యులను కూడా వదలకుండా చివరకు తల్లి,చెల్లిగురించి పాతాళం లోకి దిగజారేవిధంగా రాయించారు.
–రాజకీయాలలో కొనసాగేందుకు అర్హుడవేనా?
–ఈ విధంగా చేస్తేనే నీవు నీ ఇమేజ్‌ ను పొందుతావానుకుంటున్నావా?ఇంకా దిగజారిపోతున్నావు.ఎవరో పనికిమాలినవారు ఇంట్లో కూర్చుని రాస్తున్నవి కాదు.
–హైద్రాబాద్‌ లో బాలకృష్ట బ్లిల్డింగ్‌ ,టిడిపి కార్యాలయం,విజయవాడలోని సోషల్‌ మీడియా భవనం వీటినుంచి రాయించారు.
గత ఏడేళ్లుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా రెండువేలమందిని నియమించుకుని తెలుగుదేశం ఇదే కార్యక్రమాన్నినడుపుతోంది.
–కాబట్టి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు.«ఇది జగన్‌ గారికి ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతోంది.సోషల్‌ మీడియాలో చంద్రబాబు చేయిస్తున్నప్రచారం.
–ఈరోజున ఇంత బారీ స్కీమ్స్‌ ఏవిధంగా అమలు చేయాలని అహిర్శశలు శ్రమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ పోతుంటే నీ ప్రభుత్వం చేసిన పాపాలు వెంటాడుతున్నాయి.అయినా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ధైర్యాన్ని కోల్పోకుండా ఏమాత్రం ఇంటరప్షన్‌ లేకుండా పాలనను గాడిలో పెట్టి జగన్‌ గారు ముందుకు సాగుతున్నారు.
–రాష్ట్రంలో ఎకనమిక్‌ స్ట్రక్చర్‌ డీరైల్‌ అయిపోయింది.దానిని గాడిలో పెట్టడానికి పడే అవస్త అంతా ఇంతా కాదు.పురాణాలు చదువుకున్నాం.లోకకల్యాణం కోసం రుషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు.రాక్షసుడు ఆటంకాలు కల్పిస్తుంటారు.తెలుగుదేశం వ్యవహారశైలి ఆ విధంగా ఉంది.
–టిడిపి ఘోరపరాజయం గురించి కూర్చుని ఎందుకు నేను ఓడిపోయాను అని ఆలోచించాలి.రెక్టిఫై చేయడానికి ఆలోచించాలి.అలా చేయకుండా ప్రజలకు సేవచే సే ప్రభుత్వంను విమర్శిస్తుంటే నీ క్రెడిబులిటి మరింతపడిపోతుంది. 
–అ«ధికారం లో ఉన్నవిధంగానే వ్యవహరిస్తున్నావు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్‌ చేస్తాడు తర్వాతి రోజు ప్రెస్‌ మీట్‌ ,ఆ తర్వాత టెలీకాన్ఫరెన్స్‌ పెడతాడు.మరోరోజు ముఖ్యనేతలతో సమావేశం అంటాడు.ఆ వివరాలన్నీ మీడియాకు ఇస్తారు.ఆయనకు అనుకూలమైన మీడియా ఉంది.అది పచ్చమీడియా అంటారు.
–24 గంటలు బురదచల్లేకార్యక్రమం చేస్తుంటాడు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడు.భరించలేని దుగ్ద.తన ఆస్దిని ఎవరో తీసుకెళ్లారనే భావనతో విచక్షణ పోగుట్టుకుని సహనం కోల్పోయాడు.
–చంద్రబాబునాయుడు ఒకటి గుర్తుంచుకోవాలి.రాజకీయాలలో ఉన్నవ్యక్తి అధికారంలో శాశ్వతంగా ఉంటారనుకోవడం పొరపాటు.
–ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వం చేత పనిచేయించడంలో కీలకపాత్ర ఉంటుంది ఆ పాత్ర పోషించకుండా తన పార్టీ లోని లీడర్స్‌ ను బిజేపిలోకి కోవర్ట్‌ లుగా పంపారు.వాళ్లు శుద్దులు చెబుతున్నారు.
–చంద్రబాబునాయుడు ఒకటి ఆలోచించుకోవాలి నీ అవినీతి,దోపిడీ,అరాచకాలను ప్రజలు తిరస్కరించారు అనేది గుర్తుంచుకోవాలి.అయినా ఓటమినుంచి పాఠం నేర్చుకోలేదు.
–మద్యం పాలసి ప్రభుత్వం ప్రవేశపెట్టింది.అక్రమాలు అరికట్టేందుకే ప్రభుత్వదుకాణాలు ఏర్పాటుచేసింది.దానిపై కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు.గతం గుర్తుకుతెచ్చుకో ఎన్టీఆర్‌ హయాంలో ప్రభుత్వమే సారాదుకాణాలు నడిపింది.వారుణివాహిని తయారుచేయించారు. 
–గ్రామసచివాలయాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు కుళ్లుకుంటున్నావు.నరేంద్రమోదిగారిని కలిస్తే కేసులు కోసమన్నట్లుగా మాట్లాడుతున్నారు.నరేంద్రమోది స్దాయిని దిగజారుస్తున్నారు.మోదిని కలిస్తే కేసులు కొట్టేస్తారా.బిజేపి లీడర్లు స్పందించాలి.
–జే టాక్స్‌ అని ప్రచారం మొదలు పెట్టారు.చంద్రబాబు హయాంలో కే టాక్స్‌ పాపులర్‌ అయింది.సి టాక్స్‌ చినబాబు టాక్స్‌ ఇలా ఎన్ని అమలు చేశావు.దీనినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జే టాక్స్‌ అని దుష్ప్రచారం చేస్తున్నారు.
–ప్రజారంజకమైన పరిపాలనను ఎంజాయ్‌ చేస్తున్నారు.నీ దు్రష్ప్రచారాన్ని ప్రజలు నమ్మేపరిస్దితిలో లేరు.తెలుగుదేశం అనేది ముగిసిన అధ్యాయం.నీ తెలివితక్కువతనం బయటిపడిపోతుంది.అక్రమ నివాసంలో ఉంటూ లింగమనేనికి మధ్దతు ఇచ్చావు. పోలవరం ఏటిఎం గా మార్చుకున్న కాంట్రాక్టర్‌ కు మధ్దతు ఇచ్చావు.నీ పార్టీలో ఉంటూ నీవల్ల చనిపోయిన ఫ్యాక్షనిస్ట్‌ కు మధ్దతు ఇచ్చావు. మీరు లంచాలు తీసుకున్న పిపిఏలు రద్దుచేస్తే దాని వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్న అంశం మరిచిపోయి వారికి మధ్దతు ఇచ్చావు.
–వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో ప్రజాస్వామ్యబధ్దంగా పోరాడే శక్తి లేక నీ పార్టీనేతలను,రాజ్యసభసభ్యులను వ్యూహాత్మకంగా సగంమందిని పంపించి అదేదో గొప్ప రాజకీయం అని అనుకుంటున్నావు.
నీవు ఈ విధంగా విషప్రచారం చేయడం ద్వారా సమాజాన్ని పాడు చేయడం దుర్మార్గం.రాజకీయాలనుంచి తప్పుకుంటే మంచిది.ఆయన మైండ్‌ కరప్ట్‌ అయిపోయింది.