ఇంద్రకీలాద్రిపై నేడు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం...
, విజయవాడ: : ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం (ఆశ్వయుజ శుద్ధ చవితి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరిస్తుంది. చేతిలో రసపాత్రను ధరించి ఎరుపు, పసుపు, నీలం రంగు దుస్తుల్లో చవితి నాడు అమ్మ అన్నపూర్ణాదేవిగా కొలువుదీరుతుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి బిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. అక్షయ శుభాలను అందించే ఈ తల్లి.. తనను కొలిచే వారికి ఆకలి బాధను తెలియనివ్వదంట. అన్నపూర్ణగా దర్శనమిచ్చే అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇంద్రకీలాద్రిపై నేడు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం...