ఈనెల 6న ఆళ్లగడ్డలో జరిగే అఖిలపక్ష సభకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం చెప్పింది

గుంటూరు ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం తెలుగుదేశం నాయకులతో పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు భేటి అయ్యారు.
ఈ సందర్భంగా చర్చనీయాంశాలు:
1). యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా టిడిపి సంఘీభావం: యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తోంది. యురేనియం తవ్వకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమిటి..? కడప జిల్లాలో యురేనియం తవ్వకాలు తెచ్చింది మీ నాయనే(వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే). 5గ్రామాలను నాశనం చేశారు. అదే ఇప్పుడు నల్లమల అంతా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఇతర ప్రాంతాలలో ఆందోళనలు ఉధృతం అవుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకని స్పందించరు..? ఈనెల 6న ఆళ్లగడ్డలో జరిగే అఖిలపక్ష సభకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం చెప్పింది. యురేనియం తవ్వకాలపై విస్తృత ప్రజాభిప్రాయం మేరకే చర్యలు తీసుకోవాలి.
2).బోటు తీయడంలోనే వైసిపి ప్రభుత్వ పనితీరు బైటపడింది. కచ్చలూరు(తూ.గో జిల్లా) వద్ద పడవ మునిగి 20రోజులైనే తీయలేని వ్యక్తి, కోతలు కోస్తున్నారు. గోదావరి పుష్కరాలలో ప్రమాదవశాత్తూ 28మంది చనిపోతే దానిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసిన వాళ్లు, ఇప్పుడీ పడవ దుర్ఘటనలో 50మందిపైగా చనిపోయినా, ఇంకా అనేక మృత దేహాల ఆచూకి లేకపోయినా, మంత్రిపైనే ఆరోపణలు వచ్చినా, ఎందుకని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలేదు. మంత్రి నిర్వాకం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులే చెబితే, ఆయనపై యాక్షన్ ఎందుకని తీసుకోలేదు..? కచ్చలూరు పడవ ప్రమాదంపై వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి.
3).రివర్స్ టెండర్ల వల్ల  రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలన్నీ చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. పోలవరం 5వ ప్యాకేజికి రివర్స్ టెండర్లు పిలవడం జగమొండి వైఖరికి నిదర్శనం. అది రివర్స్ టెండర్లు కావు, రిజర్వ్ టెండర్లు. కావాల్సిన వాళ్లకు టెండర్ కట్టబెట్టి ముడుపులు దండుకునేందుకే ఈ రివర్స్ పన్నాగం. మిగిలిన వారందరినీ బెదిరించి, భయపెట్టి సింగిల్ టెండర్ వచ్చేలా చేస్తున్నారు. రివర్స్ టెండర్ల ముసుగులో స్టేట్ డెవలప్ మెంట్ నే రివర్స్ చేస్తున్నారు. 
4).వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'చెప్పేదొకటి, చేసేదొకటి' అనేదానికి తాజా ఉదాహరణ వాహన మిత్ర పథకం. 4నెలల్లో 4వర్గాల వారిని దారుణంగా వంచించారు. మొదటినెలలో మహిళలను, రెండవ నెలలో రైతులను, మూడో నెలలో యువతను, ఇప్పుడు  5లక్షల మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లను దారుణంగా మోసగించారు. ఎన్నికల ముందు అందరికీ రూ.10వేలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక అనేక ఆంక్షలు విధించి 5లక్షల మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు టోకరా ఇచ్చారు. కేవలం లక్షా 73వేల దరఖాస్తులే రావడం వైసిపి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.  ఇప్పుడు చెప్పే ఆంక్షలన్నీ ఎన్నికల ముందు ఎందుకని చెప్పలేదు. ఇవన్నీ ఉంటేనే ప్రభుత్వ లబ్ది చేస్తామని అప్పుడే ఎందుకు చెప్పలేదు. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఓడ దిగాక బోడి మల్లయ్య లా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారు.
5).గ్రామ వాలంటీర్ల ముసుగులో వైసిపి కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన మహిళ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మచిలీపట్నం మండలం రుద్రారంలో పించన్ పొందే వృద్దులు, వికలాంగుల నుంచి గ్రామ వాలంటీర్లు దసరా మామూళ్లు వసూలు చేయడం గర్హనీయం.
6).పంచాయితీ సిబ్బందికి నాలుగైదు నెలలుగా జీతాలు చెల్లించక పోవడం వైసిపి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. నెలల తరబడి వేతనాలు లేక దాదాపు 65వేల కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఉన్న ఉద్యోగులకే జీతాలు చెల్లించలేని దుస్థితిలో 4లక్షల మంది వైసిపి కార్యకర్తలకు ఉద్యోగుల ముసుగేసి ఏడాదికి రూ.2వేల కోట్లు దోచి పెడుతున్నారు. దసరా పండుగకు ముందే జీతాలు, పించన్లు అందేలా చూసేవాళ్లు, అలాంటిది ఇప్పుడు 4వ తేదీ వచ్చినా ఇంకా ఉద్యోగులు,అవుట్ సోర్సింగ్ సిబ్బంది 80వేల మందికి జీతాలు చెల్లించక పోవడం వైఫల్యమే..
7).వైసిపి ప్రభుత్వ చేతకాని తనం వల్లే రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ కుదేలయ్యింది. ఇసుక కొరతతో పేదల జీవనోపాధికి గండికొట్టారు.  పన్ను రాబడి గణనీయంగా పడిపోయింది. పెట్టుబడులు, రుణాలకు గండిపడింది. అన్ని రంగాల్లో రాష్ట్ర రాబడి తీవ్రంగా దెబ్బతింది. 11% జిఎస్ డిపి వృద్ది రేటుతో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పగిస్తే, వైసిపి నేతల చేతకానితనం వల్ల తిరోగమనంలోకి(రివర్స్ డెవలప్ మెంట్) నెట్టారు. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా వినియోగించుకునే సామర్ధ్యం ప్రస్తుత పాలకుల్లో కొరవడింది. కన్వర్జెన్స్ ద్వారా నరేగా నిధులు రూ.32వేల కోట్ల పైగా కేంద్రం నుంచి టిడిపి ప్రభుత్వం రాబడితే, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా విడుదల చేయకుండా వైసిపి ప్రభుత్వం అభివృద్దికి మోకాలడ్డింది.
.తన కేసులనుంచి బైటపడాలన్న ఆరాటమే తప్ప సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాభివృద్దిపై శ్రద్ద లేదు. కోర్టు వాయిదాలకు ఏవిధంగా ఎగ్గొడదాం, కేసుల విచారణ వేగాన్ని ఎలా అడ్డుకుందాం అనే దురాలోచనలతోనే కాలం గడిపేస్తున్నారు. కావాలనే కేసుల విచారణను డిలే చేస్తున్నారు. తానేదో నీతిమంతుడిగా ఫోజులు కొట్టేముందు, ఆయన కేసుల సత్వర విచారణకు సహకరించాలి. బెయిల్స్ తిరస్కరణకు జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక నేరాలు, కోర్టులకు ఒక (క్లాసికల్) ఎగ్జాంపుల్ గా మారాయి. ఆర్ధిక నేరాలకు ఆయనే ఒక ఉదాహరణగా చూపించి, అవే నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇతరులకు కోర్టులు బెయిళ్లు తిరస్కరించడం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నేరాలను ఉదహరించి మరీ, వారి బెయిళ్లను తిరస్కరిస్తున్నారంటేనే వాటి తీవ్రత తెలుస్తోంది.
9)జైల్లో మీ సహ నిందితులు అందరికీ ప్రభుత్వంలో ముఖ్య పదవులు కట్టబెడుతున్నారు. ఏ1గా మీరు ఉంటే, ఏ2ను ఎంపిని చేశారు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవితోపాటు 5పదవులు ఇచ్చారు. మరో ఇద్దరు సహ నిందితులకు టిటిడి ట్రస్ట్ బోర్డ్ సభ్యత్వ పదవులు ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి అధికారులను కీలక స్థానాల్లో నియమించారు. ఒక నిందితుడు ఎన్నికల్లో ఓడినప్పటికీ, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు, కేసులను నిర్వీర్యం చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అడ్డదారులన్నీ తొక్కుతున్నారు.
10).వర్ల రామయ్య: భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తున్నారు. తాను క్రిస్టియనో, హిందువో స్పష్టత ఇవ్వకుండా అందరినీ మోసం చేస్తున్నారు. ఆలయాల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. సొంత బాబాయి చనిపోయి ఏడాది కాకుండానే, మైలలో ఉండి తిరుమల శ్రీవారికి పట్టు వస్థ్రాలు ఎలా తీసుకెళ్తారు..? ఈ రోజు కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఎలా ఇస్తారు..? తండ్రి చనిపోయిన ఏడాది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండికూడా బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు తీసుకెళ్లలేదు. ఇటీవల సోదరి చనిపోయినప్పుడు కెసిఆర్ కూడా, ఆచారాన్ని పాటించి ఆలయ మర్యాదలకు, భక్తుల మనోభావాలకు గౌరవించారు. ఏసు ప్రభువును, వెంకటేశ్వర స్వామిని ఇద్దరినీ జగన్మోహన్ రెడ్డి మోసగిస్తున్నారు. 
ఈ భేటిలో టిడిఎల్ పి ఉపనేత బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, మద్దాలి గిరి,అశోక్ బాబు,వర్ల  రామయ్య,పోతుల సునీత, టిడి జనార్దన్, కుటుంబరావు,నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం