విభిన్నప్రతిభావంతులకు త్వరలో యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డులు

విభిన్నప్రతిభావంతులకు త్వరలో యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డులు
*  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం
అమరావతి: రాష్ట్రంలోని విభిన్నప్రతిభావంతులకు(వికాలాంగులు) యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులను(స్మార్ట్ కార్డులు) జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. విభిన్న ప్రతిభా వంతులకు యుడిఐడి కార్డులు జారీ చేసే అంశంపై మంగళవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా వారి వివరాలను సేకరించి ఆన్లైన్ పోర్టల్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఆవిధంగా సేకరించిన వివరాలన్నిటినీ పరిశీలించి ప్రభుత్వ ప్రవేట్ మెడికల్ కళాశాలల భాగస్వామ్యంతో సకాలంలో సర్టిఫికెట్లు జారీచేసి తదుపరి యుడిఐడి కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇప్పటికే సదరమ్ సర్టిఫికెట్లు కలిగిన వారు మరలా ఇందుకోసం వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెర్ప్ వద్ద ఉన్న డేటాను అంతటినీ నేరుగా యుడిఐడి కార్డులు జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థకు పంపాలని సిఎస్ ఆదేశించారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకుగాను వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసి వెంటనే ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని విభిన్న స్ర్తీ శిశు,ప్రతిభావంతుల సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శి దమయంతిని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. 
 రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)ద్వారా ఇప్పటి వరకూ 13 జిల్లాల్లో వికలాంగులకు సదరమ్ సర్టిఫికెట్ల జారీకి 12లక్షల 35వేల 493 ధరఖాస్తులు స్వీకరించి 10లక్షల 78వేల 70 ధరఖాస్తులను అనగా 87.26 శాతం అంకవైకల్య నిర్ధారణ చేయగా వాటిలో 8లక్షల 48వేల 422 మందికి సదరమ్ సర్టిఫికెట్లను జారీ చేయడం జరిగిందని స్త్రీశిశు మరియు దివ్యాంగుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి వివరించారు.వాటిలో 5లక్షల సర్టిఫికెట్లకు సంబంధించిన డేటాను యుడిఐడి కార్డులు జారీ చేసే సంస్థకు బదిలీ చేయగా మరో 4లక్షల మందికి సంబంధించిన డేటాను బదిలీ చేయాల్సి ఉందని చెప్పారు.గత ఏడాది ఆగస్టు 3 నుండి అక్టోబరు 20 వరకూ డిజిటల్ సర్టిఫికెట్ల జారీకై మీసేవ కేంద్రాల ద్వారా ప్రత్యేక స్లాట్లను కేటాయించగా 80వేల 995 మంది ధరఖాస్తు చేయగా వారిలో 57వేల 662 మందికి సర్టిఫికెట్లను జారీ చేసినట్టు తెలిపారు.కాగా యుడిఐడి కార్డులకు సంబంధించి ఇప్పటికే జోన్ల వారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.ఆన్లైన్లో ధరఖాస్తులు స్వీకరణకు ఇ-ప్రగతి బృదం ద్వారా గ్రామ,వార్డు సచివాలయాల్లో పోర్టల్ ను అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు.
 విభిన్న ప్రతిభావంతులకు(వికలాంగులు)స్వావలంబన కార్డు పేరిటి స్టాండర్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సైజులో జారీ చేయనున్న యూనివర్సల్ యుడిఐడి కార్డుతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి.ముఖ్యంగా వికలాంగులైన వారు వారి అంగవైకల్యాన్ని రుజవు చేసేందుకు పలు సర్టిఫికెట్లను కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.అంతేగాక ప్రస్తుతం వికలాంగులకు ఒక రాష్ట్రంలో జారీ చేసిన సర్టిఫికెట్లను మరో రాష్ట్రంలో ఆమోదించక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవని దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఈయూనియక్ డిజబిలిటీ ఐడి కార్డు ఆమోదించే విధంగాఉంటుంది.అంతేగాక కార్డును ప్రయాణ సమయంలో జేబులో గాని లేదా పర్సులోగాని సులభంగా తీసుకువెళ్లేందుకు వీలుంటుంది.అదే విధంగా ఈయుడిఐడి కార్డుతో దేశవ్యాప్తంగా రైల్వే సేవలను సులభంగా పొందేందుకు,విద్యా సంస్థల సేవలను పొందేందుకు ఎంతో సులభంగా ఉంటుంది.ఈకార్డు ద్వారా ఆయా వికలాంగుని అంగవైకల్యం వివరాలను కార్డురీడర్ డివైస్ ద్వారా తెల్సుకునేందుకు అవకాశం కలుగుతుంది.అంతేగాక ఒకసారి ఈవిధంగా యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డు జారీ అయితే రియల్ టైమ్ లో ఆయా వికలాంగుల పరిస్థిని ప్రభుత్వం సులభంగా తెల్సుకునేందుకు వీలుంటుంది.ఒక వికలాంగునికి సంబంధించిన అంగవైకల్యం వివరాలు ఒకసారి నమోదైన తర్వాత అవి కంప్టూటర్ సిస్టమ్ లో మరోకసారి డూప్లికేట్ అవ్వకుండా ఉండే యూనిక్ నెస్ ఈకార్డులకు ఉంటుంది.ఎంత శాతం మేరకు అంగవైకల్యాన్ని కలిగి ఉన్నాడనేది ఈకార్డు ద్వారా సులభంగా తెల్సుకునేందుకు వీలుంటుంది.అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేసే వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు ఆయా వికలాంగులకు ఏవిధంగా అందుతున్నాయనేది సులభంగా తెల్సుకునేందుకు వీలుంటుంది. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కమీషనర్ దుర్గాప్రసాద్, దివ్యాంగుల సంక్షేమశాఖ సంచాలకులు డా.జిసి కిషోర్ కుమార్, సెర్ప్ సిఇఓ రాజబాబు, కేంద్ర ప్రభుత్వ క్సనల్టెంట్ గుప్త తదితరులు పాల్గొన్నారు.


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..