నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి సుచరిత

లైంగిక దాడి ఘటనపై సీరియస్‌'
నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి సుచరిత
నరసరావుపేట : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత మహిళకి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేశాం. చట్టపరంగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించాం. ప్రస్తుతం బాధిత మహిళ ఆసుపత్రిలో కోలుకుంటోంది. ప్రభుత్వం తరపున బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.  లైంగిక దాడికి గురైన బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వం నుంచి సహాయం సత్వరం అందే విధంగా కృషి చేయడంతో పాటూ, గ్రామంలో రక్షణ కూడా కల్పిస్తామని వెల్లడించారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడులో లైంగిక దాడికి గురై నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలికను ఆమె పరామర్శించారు. సంఘటన గురించి బాలిక తల్లితండ్రుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌తో మాట్లాడానని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం పూర్తిస్థాయిలో అందే విధంగా మహిలా కమిషన్‌ చొరవ తీసుకుంటుందని తెలిపారు. పోలీసు రిపోర్టు అందగానే ఆ కుటుంబానికీ మొదట కొంత మొత్తంలో ఆర్థిక సాయం అందుతుందని, చార్జిషీటు పెట్టిన తర్వాత మరికొంత అందుతుందని చెప్పారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని గైనకాలజిస్టుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో ఇటువంటి సంఘటనలు గతంలో జరిగాయని, మళ్లీ పునరావృతం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ఎస్‌ఐతో మాట్లాడామన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ఇటువంటి దుశ్చర్యలపై తల్లితండ్రులు, బాలికలకు అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నిందితులకు కఠినమైన శిక్షలు పడే విధంగా మహిళా కమిషన్‌ తరఫున ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడి వయస్సుపై వస్తున్న ఆరోపణలపై కూడా మహిళా కమిషన్‌ విచారిస్తుందని తెలిపారు. గ్రామంలో ఆ కుటుంబానికీ రక్షణ కోసం జిల్లా ఎస్పీతో మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం ఎవరినీ వెనకేసుకు రాదని హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం గాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో నూర్‌ బాషా సంఘ నాయకులు షేక్‌ హుస్సేన్, డీబీహెచ్‌ఎఫ్‌ నాయకుడు గోదా రమేష్‌కుమార్, షేక్‌ మీరావలి పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image