ధరల పతనంపై ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ ఆరా

అమరావతి
*అమరావతి: కర్నూలు జిల్లా పత్తికొండలో టొమాటో కొనుగోళ్లలో సమస్యలు,  ధరల పతనంపై ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ ఆరా
టమోటా కొనుగోలులో తలెత్తిన సమస్యలపై సమాచారం కోరిన ముఖ్యమంత్రి
పండ్లు, కూరగాయలను డీ రెగ్యులేట్‌ చేశామన్న అధికారులు
దీనివల్ల మార్కెట్‌ ఫీజు లేకుండా, ఏజెంట్లకు కమిషన్‌ ఇవ్వకుండా రైతులు అమ్ముకోవచ్చన్న అధికారులు
డీ రెగ్యులేట్‌ చేయడంపై టమోటా కొనుగోలు నిలిపేశారన్న అధికారులు
పత్తికొండ మార్కెట్లో కాకుండా మార్కెట్‌ బయటకు వచ్చి అమ్మితేనే కొంటామని ఏజెంట్లు రైతులను ఇబ్బందులకు గురిచేశారన్న అధికారులు
మార్కెట్లోనే తాము టామోటాను అమ్ముతామని రైతులు స్పష్టంచేశారని వెల్లడి
ఏదిఏమైనా రైతులు ఇబ్బందులు పడకూడదని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి
వెంటనే మార్కెటింగ్‌ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని ఆదేశాలు
మార్కెట్లో పరిస్థితులను సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి
వెంటనే మార్కెటింగ్‌ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని ఆదేశాలు
సీఎం ఆదేశాలతో పత్తికొండ మార్కెట్‌యార్డులో తిరిగి టమోటా కొనుగోళ్లు ప్రారంభం
రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశామన్న అధికారులు
ఉదయం నుంచి 50 టన్నుల టమోటాను కొనుగోలుచేశారన్న అధికారులు
ధరలు తగ్గకుండా వేలంపాటలో పాల్గొంటున్న మార్కెటింగ్‌శాఖ అధికారులు
5 టన్నుల వరకూ కొనుగోలుచేసిన మార్కెటింగ్‌ శాఖ
ధరలస్థిరీకరణ నిధి కింద ఈ కొనుగోళ్లు 
ఇప్పుడు వ్యాపారులు కూడా వచ్చి టమోటాను కొనుగోలుచేస్తున్నారని మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న  వెల్లడి