రివర్స్‌ పాలనలో అన్నిరంగాల్లో తిరోగమనమే

తేది 24-10-2019


విలేకరుల సమావేశం వివరాలు...


   రివర్స్‌ పాలనలో అన్నిరంగాల్లో తిరోగమనమే.


    - టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి, ఆదాయం, వృద్ధిరేటుపై, 4 నెలలపాలనలో సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమా?


- జగన్‌కు ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ అంటే ఏంటో తెలీదు.


  - హోదా ఇస్తేతప్ప రాష్ట్రాన్ని నడపలేమని జగన్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది.


  - అభివృద్ధి నిలిచిపోవడానికి, ఆదాయం లేకపోవడానికి వైసీపీ నిర్ణయాలే కారణం


- తెలుగుదేశం హయాంలో 5లక్షల40వేల ఉద్యోగాలిచ్చారని మంత్రే చెప్పారు.


- జగన్మోహన్‌రెడ్డి హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు.


        - శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ కనకమేడల రవీంద్రకుమార్‌, శ్రీనక్కా ఆనందబాబు.


       రాష్ట్రం అధోగతి పాలుకావడానికి, అభివృద్ధి కుంటుపడటానికి వైసీపీప్రభుత్వం అనుసరి స్తున్న విధానాలే కారణమని, ఏ రంగంచూసినా కూడా రివర్స్‌పాలనే నడుస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా తిరోగమనమేతప్ప, ఎక్కడా పురోగమనంలేదని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రివర్యులు, ఎమ్మెల్సీ యనమలరామకృష్ణుడు పేర్కొన్నారు. గురువారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ బీటీనాయుడు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి పోతులసునీతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటున్న మంత్రులు వాస్తవాలు తెలుసుకోవాలని యనమల హితవు పలికారు. 2014-15లో రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎలా ఉందో, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం  అవరోధాలు దాటుకుంటూ, ఎలా అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు నడిపిందో , వైసీపీనేతలు రాష్ట్రప్రజల్ని అడిగి తెలుసుకోవచ్చన్నారు. కష్టాలను అధిగమిస్తూనే, ప్రజలపై పన్నులు వేయకుండానే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 2014-15లో ఆంధ్రాకు, తెలంగా ణకు మధ్య రెవెన్యూ వ్యత్యాసం 8శాతముంటే, తెలుగుదేశం దిగిపోయేనాటికి, దాన్ని 1శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి  రూ.16వేల కోట్ల పైచిలుకు రెవెన్యూలోటుంటే, 14వ ఆర్థికసంఘం తననివేదికలో భవిష్యత్‌లో రూ.22వేల కోట్లవరకు రెవెన్యూలోటు ఉండొచ్చని అంచనా వేసిందని, అదికూడా తెలియకుండా రాష్ట్రమంత్రి రూ.22వేలకోట్ల రెవెన్యూలోటని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లోటుబడ్టెట్‌లో ఉండికూడా ఆర్థికరంగాన్ని గాడినపెట్టి, టీడీపీపాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధిని నమోదుచేయడం జరిగిందని యనమల తెలిపారు. కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల్లో రాష్ట్రానికి ఆదాయంలేదని వైసీపీమంత్రులే ఒప్పుకున్నారని, ఆదాయం లేకపోవడానికి వారే కారణమని మాజీమంత్రి తేల్చిచెప్పారు. ప్రధానికి, అమిత్‌షాకు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వేర్వేరు నివేదికలను బయటపెడితే ప్రభుత్వ నిర్ణయాల్లోని డొల్లతనం ఏమిటో బహిర్గతమవుతుందన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు, ప్రత్యేకహోదా ఇస్తేతప్ప రాష్ట్రాన్ని నడపలేమని వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు.78శాతం నుంచి 68శాతం వరకు వృద్ధి పడిపోయిందని, రాష్ట్రప్రభు త్వమే అంగీకరించిందన్నారు. 2014-15లో టీడీపీ పాలనలో ఆర్థికాభివృద్ధిరేటు 9శాతముంటే, తాముదిగిపోయేనాటికి, నాలుగేళ్లలో సరాసరిన దాన్ని 11.02శాతానికి చేర్చామన్నారు. అదేవిధంగా టీడీపీ వచ్చేనాటికి తలసరి ఆదాయం రూ.93వేలుంటే,  దిగిపోయేనాటికి రూ.లక్షా64వేల రూపాయలకు దాన్ని పెంచామన్నారు. వైసీపీప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదికలో గతేడాదికి, ఈ ఏడాదికి తలసరిఆదాయం రూ.17వేలకు పైగా తగ్గిందన్నారు. టీడీపీ హయాంలో నాలుగేళ్లలో తలసరి ఆదాయం ఎప్పుడూ తగ్గలేదని,   ఒకమనిషి ఆదాయం రూ.17వేలుతగ్గడానికి, రాష్ట్రరెవెన్యూ ఆదాయం తగ్గడానికి, ఆర్థికా భివృద్ధిరేటు 8శాతం తగ్గడానికి   వైసీపీ ప్రభుత్వం కారణం కాదా అని రామకృష్ణుడు ప్రశ్నించారు. తెలుగుదేశమే కష్టాలు తెచ్చిపెట్టిందని, కేంద్రం ఆదుకోకుంటే, రాష్ట్రాన్ని నడిపించలేమని వైసీపీ ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ ప్రజల్ని మోసగించడమేనన్నారు.   ఆదాయం, అభివృద్ధిరేటుని పెంచేలా, పోలవరం, అమరావతి సహా ఇతర నిర్మాణాలు  నిరాటంకంగా కొనసాగించినందునే తెలుగుదేశం పాలనలో వృద్ధిరేటు, తలసరి ఆదాయం  పెరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కొరత కారణంతో నిర్మాణాలు నిలిచిపోయి, పేదలు, సామాన్యులకు పనిలేకుండా పోవడంతో ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గిపోయి, తలసరిఆదాయం, వృద్ధిరేటు తగ్గిందన్నారు. పనిలేకుండా ఆదాయం ఎక్కడినుంచి వస్తుందో, కొనుగోలు శక్తి తగ్గడానికి వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేకారణమన్నారు.  ఇలా ఆదాయ,వ్యయాలకు ఖర్చులకు మధ్య ఒకసారూప్యత ఉంటుందనే కనీస ఆలోచన కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. పేదవాడు బాగుపడకుండా, వారికి ఏవిధమైన సౌకర్యాలు లేకుండా చేస్తే, రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుందని యనమల ప్రశ్నించారు. జగన్‌, అమిత్‌షాకు ఇచ్చిన నివేదికలో సర్వీసెస్‌, ఇండస్ట్రీస్‌ పడిపోయాయని చెప్పారని, అర్బనైజేషన్‌ లేకుండా సేవారంగం ఎలా వృద్ధిలోకొస్తుందన్నా రు. గృహనిర్మాణం సహా, మౌలిక వసతుల కల్పన వంటివన్నీ వైసీపీ పాలనలో పడకేశాయ ని, ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో టీడీపీ ఎమ్మెల్సీఅడిగిన ఓప్రశ్నకు సమాధానంగా, రాష్ట్ర పరిశ్రమలమంత్రి మాట్లాడుతూ, తెలుగుదే శం హయాంలో రూ.వేలకోట్లతో పరిశ్రమలు ఏర్పాటుచేసి, 5లక్షల40వేల వరకు ఉద్యోగాలు కల్పించారని, చెప్పినమాట వాస్తవం కాదా అని యనమల నిలదీశారు. గ్రామవాలంటీర్‌, సచివాలయ ఉద్యోగాలు చేయడానికి ఎవరూ ముందకురావడం లేదని,  వారి నియామకం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుందో భవిష్యత్‌లో తెలుస్తుందని యనమల ఎద్దేవాచేశారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై జగన్‌కు అవగాహనలేదని,   అందుకు ఆయన పరిశ్రమలు, వృద్ధిరేటు, ఆదాయవ్యయాలు ఆయనకు పట్టవన్నారు. గతప్రభుత్వంలో రాష్ట్రం ఈజ్‌ఆఫ్‌డూయింగ్‌లో రెండుసార్లు తొలిస్థానంలో నిలిచిందని, వరల్డ్‌బ్యాంకే ఆ స్థానాన్ని కట్టబెట్టిందన్నారు. ఎకానమీ గురించి జగన్మోహన్‌రెడ్డి పట్టించుకో డని, అది తెలియకపోవడంవల్లే రాష్ట్రంలో ఎకనామిక్‌యాక్టివిటీస్‌ లేకుండా పోయాయని   మాజీమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రజలకులభించని ఇసుక, పక్కరాష్ట్రాల్లో మాత్రం లారీ రూ.లక్షవరకు అమ్ముడవుతోందన్నారు. ఈ విధమైన దోపిడీకి ఎవరు కారణమో వైసీపీ మంత్రులకు తెలియదా అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో రోడ్లు, డ్రైన్లు, ఇతరేతర అభివృద్ధిపనులతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని కూడా తెలుగుదేశం కొనసాగించిం దని, కేంద్రమిచ్చే నిధులకు తోడు అదనంగా ఖర్చు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనాసరే రోడ్లపైపడిన గుంతలుకూడా పూడ్చలేదని, ఒక్కరోడ్డు కూడా వేయలేదని రామకృష్ణుడు స్పష్టంచేశారు. అభివృద్ధిపనులు జరక్కపోతే కార్మికులకు, పేదలకు పనులు ఎక్కడినుంచి వస్తాయని, ఆదాయం లేకుండా వారిలో కొనుగోలుశక్తి ఎలా  వస్తుందని మాజీఆర్థికమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సివిల్‌, ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిలిచిపోయిందని, రుణాలిస్తామన్న బ్యాంకులు, ఆర్థికరంగసంస్థలు ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకంలేక వెనక్కు వెళ్లిపోయాయన్నారు. తెలుగుదేశానికి రుణాలిచ్చిన బ్యాంకులు వైసీపీకి ఎందుకు ఇవ్వడంలేదో ప్రభుత్వపెద్దలే సమాధానం చెప్పాలన్నారు. రాజకీయపార్టీగా అధికారం కోసం వెంపర్లాడుతూ, అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అధోగతిపాలుచేసే దిశగా  పయనిస్తూ, తెలుగుదేశంచేసిన అభివృద్ధిని తమఖాతాలో వేసుకునే దుస్థితికి రాష్ట్రప్రభుత్వం దిగజారిందని రామకృష్ణుడు మండిపడ్డారు. నాలుగునెలల వైసీపీ పాలనపై, టీడీపీ ప్రభుత్వ ం చేసిన అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించడానికి తాముసిద్ధంగా ఉన్నామని, ప్రజలకు మంచిచేశామని బీరాలు పలుకుతున్న రాష్ట్రప్రభుత్వం చర్చకు రావాలని యనమల డిమాండ్‌ చేశారు. 4, 5 విడతల రుణమాపీ సొమ్ము రూ.8వేలకోట్లను ఆపేసిన జగన్‌సర్కారు, రైతుభరోసా పేరుతో, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నిధులనే వాడుకుంటోందని, ఇలా గతప్రభుత్వం వివిధ పథకాలకు కేటాయించిన రూ.40వేలకోట్లనే, రాష్ట్రప్రభుత్వం ప్రజలకు   కేటాయిస్తూ, గొప్పలు చెప్పుకుంటోందన్నారు. పథకాలను హడావిడిగా ప్రకటిస్తూ, ఆచరణ మాత్రం నెలలతరబడి వాయిదా వేయడంచూస్తేనే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో    స్పష్టమవుతోందన్నారు. జగన్మోహన్‌రెడ్డి, కేంద్రానికి ఇచ్చిన నివేదికలే రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనాన్ని, రాష్ట్రమంత్రుల కల్లబొల్లి ప్రకటనల్లోని వాస్తవాలను బయటపెట్టాయన్నారు. కేసీఆర్‌ తనకు లబ్దిచేకూర్చాడని, గోదావరి జలాలను తెలంగాణకు అప్పగించడానికి  జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. అమరావతిపై ప్రభుత్వమేసిన పీటర్‌కమి టీని ముందుపెట్టి, జగన్మోహన్‌రెడ్డి తాననుకున్నదే నివేదికలో పొందుపరుస్తాడన్నారు.  జగన్‌హిట్లర్‌ తీరుగాప్రవర్తిస్తుంటే, ఆయన సాక్షిమీడియా 'డియాగ్రిఫ్‌'   మాదిరిగా వ్యవ హరిస్తోందని, జగన్‌పాలనపై సొంతంగా సుత్తికొట్టుకుంటోందని యనమల దుయ్యబట్టారు.  


బొత్స ఏరోటికాడ ఆపాట పాడుతున్నాడు : ఎంపీ కనకమేడల


మంత్రి బొత్ససత్యనారాయణకు ఏరోటికాడ ఆపాట పాడటం ముందునుంచీ ఉన్న అలవాటేనని, జగన్‌ మెప్పుపొందడం కోసం, తనమంత్రిపదవిని కాపాడుకోవడం కోసం రాజధానిపై తప్పుడుకమిటీలు వేస్తూ, ప్రజల్ని తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడని  తెలుగుదేశం రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ ఎద్దేవాచేశారు. బొత్స కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణంపై అనేకఅనుమానా లున్నాయని, వైఎస్‌ మరణానికి, జగన్‌, ఆయనతల్లి విజయమ్మే కారణమని, రాజశేఖర్‌రెడ్డి మృతిపై విచారణ జరపాలని కోరిన విషయాన్ని రాష్ట్రప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. అటువంటి బొత్స రాజధాని అమరావతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడన్నారు. రూ. 32వేలకోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న బొత్స, అమరావతి నిర్మాణానికి ఎన్నివేలకోట్లు పెట్టుబడి పెట్టారో తెలుసుకోవాలన్నారు. సీఆర్డీఏ స్టేట్‌మెంట్‌ ప్రకారం అమరావతిలో రూ.8వేలకోట్ల పనులు జరిగాయని అధికారికంగా పేర్కొంటే, రూ.32వేలకోట్ల అవినీతి ఎలా జరిగిందో ముఖ్యమంత్రి, మంత్రి బొత్స సమాధానం చెప్పాలన్నారు. పాలనచేతగాక, బడ్జెట్‌లో నిధులు కేటాయించలేక, రాష్ట్ర ఆర్థికవ్యవస్థను చక్కదిద్దలేక విఫలమైన వైసీపీప్రభుత్వం, గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని ఎంపీ మండిపడ్డారు. 2017-18లో పన్నులు వసూళ్లు ఎలాఉన్నాయో, ఇప్పుడుఎలా ఉన్నాయో వైసీపీనేతలు ఆలోచించుకోవాలని, వారు ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మాని, అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన హితవుపలికారు. 25 మంది ఎంపీలను ఇస్తే,  కేంద్రంమెడలు వంచుతానన్న వ్యక్తి, ఢిల్లీచుట్టూ చక్కర్లుకొడుతూ, కేంద్రపెద్దలను కలవడానికి పడిగాపులుపడుతూ, కేంద్రం కాళ్లావేళ్లపై పడే హీనస్థితికి దిగజారాడన్నారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపుల రుణాలు రద్దుచేశారు : నక్కా ఆనందబాబు


రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు అందాల్సిన రుణాలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. నవరత్నాలను సాకుగా చూపుతూ, రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడేలా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నా రు. సంక్షేమాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం హయాంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, కాపులకు కేటాయించిన రుణాలను రద్దుచేసిందన్నారు. వివిధవర్గాల సంక్షేమానికి బ్యాంకులకు కేటాయించిన నిధులనుకూడా నిలిపేయడంవల్ల, 2.50లక్షల నుంచి 3లక్షల మంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు యువతకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 4నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి నిర్మాణాలు, ఇతరేతర నివాసభవనాలు పూర్తయితే, అక్కడేమీ లేదని, గతప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం వైసీపీనేతలకే చెల్లిందన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image