నిష్ణాతులైన వారితో ఐ ఎ యస్ పరీక్షలకు శిక్షణ

తెలుగు విద్యార్థుల కోసం విజయవాడలోనే శిక్షణ 
- ఈ నెల 18 నుంచి అడ్మిషన్స్
- నిష్ణాతులైన వారితో ఐ ఎ యస్ పరీక్షలకు శిక్షణ
- ఈ నెల 24 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం
-బి.రామాంజనేయులు,రిటైర్డ్ ఐఏఎస్
విజయవాడ : ఐఏఎస్  కోచింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు ఢిల్లీకి వెళ్లి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు విద్యార్థుల కోసం మన విజయవాడలోనే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 18 నుంచి అడ్మిషన్స్ ప్రారంభిస్తున్నాం. ఈ నెల 24 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయి. పేద , మధ్య తరగతి విద్యార్థులకు ఐఏఎస్  అందని ద్రాక్ష కాదు. ప్రణాళిక బద్దంగా చదివితే ఐఏఎస్  సాధించవచ్చు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఐఏఎస్ అయ్యాం. నిష్ణాతులైన వారితో ఐ ఎ యస్ పరీక్షలకు శిక్షణ ఇస్తాం. నిరంతర శిక్షణ ప్రతి విద్యార్థి కి అవసరం. ప్రతి రోజు వార్తా పత్రికలు, న్యూస్ వీక్షించేవారికే ఐ ఎ యస్ పరీక్షలో ఉత్తమ మార్క్ లు వస్తాయి. వారికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆలిండియా సర్వీసెస్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రతిభ చాటాలనేదే తమ లక్ష్యం. పేద విద్యార్థులకు నామమాత్రంగా ఫీజు తీసుకుంటాం. బీహార్ కి చెందిన వారే అధికశాతం . ఐ ఎ యస్ లు అవుతున్నారు. తెలుగును అశ్రద్ధ చేయరాదు. ప్రస్తుత ఐ ఎ యస్ అధికారులతో ఎథిక్స్ సబ్జెక్ట్స్ పై శిక్షణ ఇప్పిస్తాం. ప్రతి రోజు ఒకగంట పాటు క్లాస్ లు చెబుతాం.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం