విశాఖ చాలా బాగుంది: యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌

విశాఖ చాలా బాగుంది: యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌
వచ్చే నెలలో భారత్‌-యూఎస్‌ సంయుక్త విన్యాసాలు
 సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ
హైదరాబాద్‌లో ఎఫ్‌-16, ఎఫ్‌-21 విమానాల రెక్కల తయారీ: యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌
విశాఖపట్నం : భారత్‌తో మెరుగైన రక్షణపరమైన సంబంధాలకోసమే వచ్చే నెలలో సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు  యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్మన్‌ తెలిపారు. భారత్‌తో అమెరికాకు మంచి దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయని, వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. విశాఖ పోర్టులో అమెరికా నౌక ఎమౌరీ ఎస్ ల్యాండ్‌కు యూఎస్‌ కాన్సుల్‌ జనరల్ జోయల్‌ రిఫ్మన్‌ స్వాగతం పలికారు. వచ్చే నెలలో విశాఖలో ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లతో యుఎస్ నేవీ సంయుక్త  విన్యాసాలు జరగనున్న నేపధ్యంలో యూఎస్‌ నేవీ అధికారులతో ఆయన మాట్లాడారు.  ఈ సందర్బంగా తొలిసారిగా విశాఖ వచ్చిన జోయల్‌ రిఫ్మన్‌ మీడియాతో మాట్లాడుతూ రేపు(మంగళవారం) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవబోతున్నట్లు తెలిపారు‌. యూఎస్‌ కాన్సుల్‌ జనరల్ ద్వారా అమెరికన్ వీసా జారీపై విద్యార్ధులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామన్నారు. అమెరికాలో రెండు లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారని, వారు నకిలీ విశ్వవిద్యాలయాల వల్ల మోసపోకుండా ఎడ్యు యుఎస్ ద్వారా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. 
తొలిసారిగా విశాఖ వచ్చానని... విశాఖ నగరం చాలా బాగుందని ప్రశంసించారు‌. అమెరికా-భారత్‌ మధ్య మెరుగైన రక్షణపరమైన సంబంధాలకోసమే సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విశాఖ తీరానికి యుఎస్ షిప్ లు రావడం ఇది మూడోసారి అని అన్నారు. యుఎస్ షిప్ లో వంద మంది మహిళానేవీ అధికారులతో పాటు మొత్తంగా 500 మంది నేవీ అధికారులున్నారని... వీరంతా వచ్చే నెలలో భారత్‌ త్రివిధ దళాలతో జరిగే సంయుక్త విన్యాసాలలో పాల్గొంటారని తెలిపారు. భారత్‌-అమెరికా సంయుక్త భాగస్వామ్యంతో త్వరలో హైదరాబాద్ లో ఎఫ్ -16, ఎఫ్-21 విమానాల రెక్కల తయారీ జరగనున్నట్లు జోయల్‌ రిఫ్మన్‌ తెలిపారు.


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..