హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగ‌స్వాములం కావ‌డం సంతోష‌క‌రం

తిరుమల : హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగ‌స్వాములం కావ‌డం సంతోష‌క‌రం
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల మ‌నోగ‌తం
హిందూ స‌నాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతం చేయ‌డంలో భాగంగా టిటిడి ఇటీవ‌ల ప్రారంభించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు(శ్రీ‌వాణి)కు విరాళాలందించి ఈ ప‌విత్ర కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములం కావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని దాత‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. దేశం న‌లుమూల‌ల నుండి 52 మంది దాత‌లు శ‌నివారం ఈ ట్ర‌స్టుకు విరాళం అందించ‌డం ద్వారా ఆదివారం దీపావ‌ళి ప‌ర్వ‌దినం నాడు విఐపి బ్రేక్‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.
ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని దాత‌లు ఆల‌యం ఎదుట మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఈ ట్ర‌స్టు ద్వారా దేశ‌వ్యాప్తంగా వెనుక‌బ‌డిన గ్రామీణ ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణం చేప‌డుతుంద‌న్నారు. క‌ర్ణాట‌క రాష్ట్రం చిక్‌మంగ‌ళూరుకు చెందిన వ్యాపార‌వేత్త శ్రీ గురుదేవ్‌, ముంబ‌యికి చెందిన పారిశ్రామిక‌వేత్త శ్రీ ప్ర‌కాష్ మాట్లాడుతూ వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు టిటిడి ఆల‌యాల నిర్మాణం చేప‌ట్ట‌డం ఎంతో బృహ‌త్త‌ర‌మైన కార్య‌క్ర‌మం అన్నారు.
చెన్నైకి చెందిన శ్రీ సోమ‌సుంద‌రం మాట్లాడుతూ నిరాద‌ర‌ణ‌కు గురైన ఆల‌యాల్లో ధూప‌దీప నైవేద్యాలు ఏర్పాటు, పేద అర్చ‌కుల‌కు ఆర్థికసాయం వంటి కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆ ట్ర‌స్టు ద్వారా నిర్వ‌హించ‌డం ముదావ‌హ‌మ‌న్నారు.
హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ రావు మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టును ప్రారంభించిన టిటిడిని అభినందించారు. మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టి స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌రింత ప్ర‌చారం చేయ‌డంతోపాటు మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం పొందేందుకు ఈ ట్ర‌స్టు భ‌క్తుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌న్నారు. ట్ర‌స్టుకు అందించే విరాళాలు నేరుగా శ్రీ‌వారి ఖ‌జానాలోకి చేరుతాయ‌న్నారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం