టిబి నియంత్రణ లక్ష్య సాధనే మనందరి ధ్యేయం:గవర్నర్

టిబి నియంత్రణ లక్ష్య సాధనే మనందరి ధ్యేయం


రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్


2025 నాటికి టిబి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్


“టిబి సీల్ సేల్ క్యాంపెయిన్” ను ప్రారంభించిన గవర్నర్


        విజయవాడ:    భయంకరమైన క్షయ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా కలిసి పనిచేయవలసి ఉందని రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ బిశ్వ భూషన్ హరి చందన్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా క్షయవ్యాధి వ్యాప్తి ఆందోళన కలిగిస్తుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం క్షయవ్యాధిని ప్రపంచ అత్యవసర స్ధితిగా ప్రకటించిందని గవర్నర్ గుర్తు చేసారు. 70వ “టిబి సీల్ సేల్ క్యాంపెయిన్”ను గౌరవ గవర్నర్ శుక్రవారం ప్రారంభించారు. రాజ్ భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా టిబి అసోసియేషన్ ప్రతినిధులు, టిబి నియంత్రణకు సహకరిస్తున్న స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


            ఈ నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ క్షయకు కారణమైన జీవిని రాబర్ట్ కోచ్ 1882 సంవత్సరంలో కనుగొన్నప్పటికీ, 137 సంవత్సరాలుగా టిబి ప్రాణాంతక వ్యాధిగా కొనసాగటం ఆందోళన కరమన్నారు. 2018లో 21.5 లక్షల టిబి కేసులు నమోదు కాగా, 2017 లో నమోదైన 18 లక్షల కేసులతో పోలిస్తే ఇది 17 శాతం పెరిగిందన్నారు. 1985 వరకు టిబికి చికిత్స వ్యవధి 12 నుండి 18 నెలలు ఉండగా, 1996లో రివైజ్డ్ నేషనల్ టిబి కంట్రోల్ ప్రోగ్రాం (ఆర్‌ఎన్‌టిసిపి) ప్రవేశపెట్టడంతో చికిత్స వ్యవధి 6 నుండి 8 నెలలకు తగ్గిందని గవర్నర్ వివరించారు. జాతీయ టిబి నియంత్రణ కార్యక్రమాన్ని 1997 నుండి రాష్ట్రంలో అమలు చేయగా, 2004 నాటికి అన్ని జిల్లాలు దీని పరిధిలో వచ్చాయని, రాష్ట్రంలో 91.7శాతం మేర ఈ కార్యక్రమం విజయవంతం కావటం సంతోషకరమని హరిచందన్ పేర్కొన్నారు.


              టిబి నియంత్రణతో పాటు ఏ ఆరోగ్య కార్యక్రమానికైనా, ప్రభుత్వమే వంద శాతం న్యాయం చేయలేదనేది అందరికీ తెలిసిన విషయమేనని, టిబి అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రెడ్‌క్రాస్, లెప్రా ఇండియా, టిబి అలర్ట్, వరల్డ్ విజన్, ఎఎమ్‌జి ఇండియా ఇంటర్నేషనల్, ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ వంటి స్వచ్ఛంద సంస్థలు దేశంలో క్షయ నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషించటం ముదావహమన్నారు. రాష్ట్రంలోని క్షయ సంఘాలు, వాటి జిల్లా శాఖలు టిబి నియంత్రణ కోసం తమ వంతు కృషి చేస్తున్నాయని, జాతీయ టిబి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య విద్యను అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పాటును అందించటం స్పూర్తి దాయకమని గవర్నర్ అన్నారు.


            మరోవైపు కొత్త టిబి కేసులను గుర్తించడం కోసం అసోసియేషన్ వ్యాధి నిర్ధారిత క్యాంప్‌లతో పాటు, టిబి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహిస్తూ, పూర్తిస్థాయిలో చికిత్సతో వ్యాధి నుండి నయం అయిన రోగులకు ప్రోత్సాహకాలు పంపిణీ చేయటం ద్వారా,  ఇతర టిబి రోగులను క్రమం తప్పకుండా చికిత్స పొందేలా ప్రోత్సహించటం మంచి పరిణామమన్నారు. 2025 నాటికి టిబి వ్యాధి వ్యాప్తిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని  ఆక్రమలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య విభాగాలు, ఆంధ్రప్రదేశ్ టిబి అసోసియేషన్లు, వారి జిల్లా శాఖల మరింతగా కృషి చేయాలని గవర్నర్ స్పష్టం చేసారు. ఇందుకు ప్రతి ఒక్కరూ ఉదారంగా సహకరించాలని హరిచందన్ విన్నవించారు.


            కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ సంచాలకులు డాక్టర్ బి వెస్లీ, అచార్య కె. సుధాకర్, అసోసియేషన్ గౌరవ ప్రధాన కార్యదర్శి బాలచంద్ర, ఎఎంజి ఇండియా ఇంటర్నేషనల్ సంచాలకులు డాక్టర్ ఎకెకె మెహంతి, టిబి అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిబి సీల్ అమ్మకం ద్వారా గణనీయమైన మొత్తాలను సేకరించిన సంస్ధల ప్రతినిధులకు గవర్నర్ మెమొంటోలను అందచేసి సత్కరించారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image