ధనత్రయోదశి కుబేరపూజ

ధనత్రయోదశి కుబేరపూజ       
ఈ భూమిపై మానవుడు ఆటంకాలను జయిస్తూ, ఆనందంగా బతకాలి. అయితే మానవుడు బతకాలంటే ధన సముపార్జన తప్పని సరి. ధర్మచింతనతో నలుగురికి సాయపడాలన్నా ధనవంతుడై ఉండాలి. పూర్వం ధనం లేక పోయినా అనేక మార్గాల్లో మానవుడు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అన్నిటికీ ధనం కావాలి. అయితే డబ్బును సంపాదించడానికి మానవుడు పడేపాట్లు అంతాఇంత కాదు. డబ్బు ఆర్జించడం కోసం చేయని ఉద్యోగం లేదు, వేసిన ఉపాయం లేదు. అందుకే మానవ జీవితంలో ధనం నిత్యవసరంగా మారింది.


ఐశ్వర్యాభివృద్ధి కోసం కుబేర పూజను చేస్తే ఐశ్వర్యం, అభివృద్ధి ఒకేసారి దక్కుతుంది. లక్ష్మిధనకనకాధులు, అదృష్టం, సౌందర్యాలనిచ్చే దేవత. లక్ష్మి కృపాకటాక్షం లేకుండా ఏది చేసినా అది అంతకంతే. ధనానికి మరో అధిపతి కుబేరుడు. ఉత్తరం దిక్కు వైపు ప్రతినిధి అయిన కుబేరుడు భూ మండలంలోని ఆగర్భంలో ఉన్న సమస్త నిధి నిక్షేపాలకూ యజమానుడు. పురాణ చరిత్రలలో తెలిపినట్టు అతి శ్రీమంతుడు అనిపించుకున్న వెంకటేశ్వరస్వామి కూడా కుబేరుని వద్ద తీసుకొన్న అప్పుకు వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉన్నాడు.


అయితే లక్ష్మిదేవి పూజను దేశమంతటా వివిధ రకాలుగా ఆచరిస్తున్నారు. లక్ష్మి కుబేర పూజను ఒకేసారి కలిపి నెరవేర్చినపుడు వారిరువురి నుంచి దొరికే ఆశీర్వాదం, శ్రేయస్సు, ద్విముఖమై పేదరికం, దారిద్య్రాలు దూరం అవుతాయి. 


 కుబేరునితో పాటు లక్ష్మి  కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేయుట శుభము. 
ఈ రోజు వెలిగించు యమదీప మహిమ 


హిమ అనే యువరాజు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిషులు  యువరాజు వివాహం జరిగిన నాలుగో రోజు రాత్రి పాము కాటు వల్ల మరణిస్తాడని చెప్పారట.కొంత కాలానికి యువరాజుకు యుక్తవయస్సు  రావడంతో అతని వివాహం జరిపించుట  జరిగింది  అత్తవారింట్లోకి అడుగుపెట్టిన అతని భార్య ఈ వార్తని విని భయపడితన తెలివితేటలతో   తనతో పాటు తెచ్చుకున్న రాశుల కొద్దీ ఆభరణాలను తమ కోట గుమ్మం ముందు రాశులుగా పోసిం కోటలోని వారందరిని కూర్చోబెట్టి  కథలు చెబుతూ తెల్లవార్లూ  మెలకువగా  ఉంచింది. రాజకుమారుడికి మృత్యుఘడియసమయంలో యముడు, పామురూపంలో కోటలోకి ప్రవేశించేందుకుప్రయత్నించాడు,  కానీ గుమ్మం దగ్గర ఉన్న బంగారు నగల కాంతులు బటులు మిగిలినవారు  అంతా మెలకువగా కనిపించారు. యమఘడియలు దాటటంతో ఇక చేసేదేమీ లేక వెనుదిరిగాడు యముడు.అందుకే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఇంటి ముందర ఉంచాలి...