జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.

హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.  
* పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్   అధ్యక్షతన సమావేశం. పాల్గొన్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్,  సభ్యులు  తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు),  కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని,  డా.పసుపులేటి హరిప్రసాద్,   మను క్రాంత్ రెడ్డి,  ఎ.భరత్ భూషణ్,  బి.నాయకర్.
* శుక్రవారం నాటి పొలిట్ బ్యూరో నిర్ణయాలు రాజకీయ వ్యవహారాల కమిటీకి వెల్లడి.  
* రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చ. 
* ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంపై చర్చ.
* పార్టీ శ్రేణులలో స్థైర్యాన్ని పెంపొందించి యువ నాయకత్వం బలోపేతానికి ఉద్దేశించిన పార్టీ కార్యాచరణ, కార్తీక మాసంలో పర్యావరణం - పరిరక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమాల నిర్వహణపై చర్చించనున్న రాజకీయ వ్యవహారాల కమిటీ.
* ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ పని తీరు, హామీలు, పథకాల అమలులో వైఫల్యాలు,  విద్యుత్ సంక్షోభం, సాగుదారుల సమస్యలు, జనసేన నేతలు, శ్రేణులపై అధికార పక్షం చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై చర్చ.
* కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుపై ఇచ్చిన హామీ అమలులో జాప్యం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై ప్రత్యేక చర్చ.
* ఇసుక విధానం అమలులో ప్రభుత్వ వైఫల్యం... ఉపాధి కోల్పోయిన కార్మికుల స్థితిపై చర్చ.
* తెలంగాణాలో గత 16 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై చర్చ.