సముద్రం లో వేటకి వెళ్లి, బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో కోస్ట్ గార్డ్ లకు చిక్కి అరెస్ట్ కాబడిన విశాఖ లో స్థిరపడ్డ ఎనిమిది మంది మత్స్య కారులను విడుదల చేయాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారు కేంద్ర ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జై శంకర్ ని కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశాఖ ఎంపీ ఎంవీవీ
విజయనగరం తిప్పలవలస ప్రాంతవాసులై ,విశాఖ స్థిరపడ్డ ఎనిమిది మంది స్థానిక మత్యకారులు జీవనాధారానికై సెప్టెంబర్ నెలలో పశ్చిమ బెంగాల్ లో అమృత బోట్ లో చేపలవేటకు వెళ్లి,పొరపాటున ఇండో -బంగ్లా సరిహద్దుకు చేరుకున్నారని ,తద్వారా అక్కడ కోస్ట్ గార్డ్
దిఘా పోర్ట్ వద్ద వీరిని అక్టోబర్ రెండో తేదీన అరెస్ట్ చేశారని అన్నారు. స్థానిక మత్యకార నాయకులు ఈ విషయాన్ని తనకు తెలిపి సహకారమడుగగా తాను కేంద్రమంత్రికి లేఖను పంపామన్నారు.ఈ విషయం పై తక్షణ స్పందన తెలియజేసి వీలైనంత త్వరగా వారిని స్వస్థలానికి రప్పించాలని కోరామన్నారు.వారిపేర్లు జతపరచడమైనది
జారీ.-శర్మ,పీ ఆర్ ఓ