హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు

హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
అబ్దుల్‌ కలాం జయంతి
కార్యక్రమం: డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా మానస ఆర్ట్‌ థియేటర్స్‌, త్యాగరాయ గానసభల ఆధ్వర్యాన కళారంగ ప్రముఖులకు పురస్కారాలు
గ్రహీతలు: కేబీ గోపాలం, అంబల్ల జనార్దన్‌, బీఎన్‌ యాదగిరి
అతిథులు: దేవులపల్లి ప్రభాకరరావు, కృష్ణ, కళా జనార్దనమూర్తి
స్థలం: కళా సుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6
కార్యక్రమం : తెలంగాణ సిటిజెన్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ మహ్మద్‌ మహబూబ్‌ (సైంటిస్ట్‌(రిటైర్డ్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)కు అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ అవార్డ్స్‌
అతిథులు: ప్రొఫెసర్లు ఎ.బాలకిషన్‌,
సీహెచ్‌ వెంకటరమణాదేవి, రెహమాన్‌, పి.నవీన్‌కుమార్‌, డాక్టర్‌ టి.శివ ప్రతాప్‌
స్థలం: జియోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌, ఓయూ
సమయం: ఉ. 11
కార్యక్రమం: మెగాసిటీ నవకళా వేదిక, మదర్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యాన అబ్దుల్‌ కలాం అవార్డ్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలు
అతిథులు: హోంమంత్రి మహమూద్‌ అలీ, తదితరులు
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం
సమయం: సా. 6.15
కార్యక్రమం: హెల్త్‌ కేర్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యాన అబ్దుల్‌ కలాం జయంతి, అవార్డుల ప్రదానం
అతిథులు: దానం నాగేందర్‌(ఎమ్మెల్యే), బి.గణేశ్‌ గుప్తా(ఎమ్మెల్యే), రుద్రరాజు పద్మరాజు, కేవీ రమణాచారి, తదితరులు
స్థలం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యా లయం, పబ్లిక్‌గార్డెన్స్‌
సమయం: సా. 6.30
గ్రంథావిష్కరణ
కార్యక్రమం: ఆకృతి ఆధ్వర్యంలో సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య జయంత్యుత్సవం. సినీ దర్శకుడు గోపాలకృష్ణ రచించిన 'రఘుపతి వెంకయ్య - సినీ వారసులు' గ్రంథావిష్కరణ
అతిథులు: కొలకలూరి ఇనాక్‌, ఎస్వీ రామారావు, కాకరాల, నెహ్రూజీ, ఆకృతి సుధాకర్‌
స్థలం: గణేశ్‌ ఆలయ కళావేదిక, ఎన్జీవో కాలనీ, వనస్థలిపురం
సమయం: సా. 5.30
దర్శక పురస్కార ప్రదానోత్సవం
కార్యక్రమం: యువకళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దర్శకుడు కేవీ రెడ్డి చలనచిత్ర దర్శక పురస్కార ప్రదానోత్సవం
స్వీకర్త: పి.సురేందర్‌రెడ్డి(ప్రముఖ దర్శకుడు)
స్థలం: ప్రసాద్‌ ఫిలిం ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌, బంజారాహిల్స్‌
సమయం: సా. 6
కవిసమ్మేళనం
కార్యక్రమం: ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావంగా తెలంగాణ సాహితి ఆధ్వర్యాన 'కవిసమ్మేళనం'
అతిథులు: అశ్వత్థామరెడ్డి(ఆర్టీసీ-జేఏసీ కన్వీనర్‌), దేవి(సామాజిక కార్యకర్త), తదితరులు
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: సా. 5
ఫిల్మ్‌ స్ర్కీనింగ్‌
కార్యక్రమం: ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌ ఆధ్వర్యంలో ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ స్ర్కీనింగ్‌
స్థలం: అలియాన్స్‌ ఫ్రాంకైసీ, బంజారాహిల్స్‌
సమయం: సా. 6.30 (రేపటి వరకు)
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
కార్యక్రమం: డాక్టర్‌ శిఖా అగ్నిహోత్రి పాండే 'సివిలైజేషన్‌ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ బనారస్‌' ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
స్థలం: అలియాన్స్‌ ఫ్రాంకైసీ, బంజారాహిల్స్‌
సమయం: ఉ. 9.30 - 8 (18 వరకు)


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image