సర్కారు వైద్యుడి నిర్లక్ష్యంపై గ్రామస్తుల నిరసన..

సర్కారు వైద్యుడి నిర్లక్ష్యంపై గ్రామస్తుల నిరసన..... సీతారామపురం: నెల్లూరుజిల్లా శివారు ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో సీతారామపురం ప్రభుత్వ వైద్యశాలలో వైధ్యాధికారి తీరును శనివారం ఆసుపత్రికి వెళ్ళిన భాధితులు తీవ్రంగా ఖండించారు. భాధితులు అందించిన వివరాల మేరకు మండలంలోని పండ్రంగి గ్రామానికి చెందిన పలువురు శనివారం నాడు ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అయితే వైద్యుడు వైద్య సేవలను ఆలస్యం చేయడంతో భాధితులు ప్రశ్నించారు. ఉంటే ఉండండి...లేకపోతే అంత అర్జంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్ళి చూపించుకోండని వైధ్యుడు ఖరా ఖండిగా చెప్పడంతో డాక్టర్ కు రోగులకు మధ్య స్వల్ప వివాదం జరిగినట్లు సమాచారం. ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి పేద ప్రజల సం క్షేమం కోసం ప్రభుత్వాసుపత్రుల నిర్వహణను చూస్తుంటే క్షేత్ర స్థాయిలో కొంతమంది వైద్యుల వ్యవహార శైలి పేద ప్రజల పాలిట శరాఘాతంగా మారుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి వారికి ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగమెందుకు, ఇంటి దగ్గర కూర్చుంటే పొయ్యేది కదా గ్రామీణ ప్రజలు తమదైన శైలిలో నిరసన తెలిపారు. జిల్లా కేంద్రానికి విసిరేసినట్టు ఉండే ఈ మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యశాలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిని కేంద్రీకరించాలని ప్రజలు కోరుతున్నారు.