విజయవంతంగా కొనసాగుతున్న రివర్స్‌ టెండరింగ్‌*

*25.10.2019*
*అమరావతి*


*విజయవంతంగా కొనసాగుతున్న రివర్స్‌ టెండరింగ్‌*


*గ్రామ, వార్డు సచివాలయాల కంప్యూటర్‌ పరికరాల కొనుగోళ్లులో భారీ ఆదా*


*డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, యూపీఎస్‌ల కొనుగోలు రూ.51.15 కోట్లు*
*ప్రింటర్ల కొనుగోలులో రూ.14.32 కోట్లు ఆదా*
*మొత్తంగా రూ.65.47 కోట్లు ఆదా*


అమరావతి : అత్యుత్తమ పారదర్శక, అవినీతి రహిత విధానాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. పోలవరం పనుల్లో రూ.839 కోట్లు, వెలుగొండ టన్నెల్‌–2 పనుల్లో రూ.62 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేసిన ప్రభుత్వం, తాజాగా గ్రామ,వార్డు సచివాలయాలకు సంబంధించి కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోళ్లులో భారీగా ప్రజాధనాన్ని ఆదా చేసింది. రివర్స్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌లో రూ.65.47 కోట్లు డబ్బు ప్రభుత్వ ఖజానాకు మిగిలింది. 


పరిపాలనలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ఇటీవల ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం భారీగా కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలుకు టెండర్లు ఆహ్వనించింది. నిర్ణీత ప్రమాణాలను అనుసరించి 29,888 కంప్యూటర్లు, 14,944 యూ.పి.ఎస్‌లకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. దీనికోసం మూడు కంపెనీలు పోటీ పడ్డాయి. 
అతి తక్కువ ధరకు కోట్‌ చేసి ఎల్‌–1 గా నిలిచిన కంపెనీ రూ.191,10,38,720 రూపాయల తక్కువ ధరకు కోట్‌ చేసింది. దీనిపై ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా మరో కంపెనీ రూ. 139,95,38,720 రూపాయలకు కోట్‌ చేసి టెండర్‌ను దక్కించుకుంది.  ఎల్‌–1 టెండర్‌ విలువ కన్నా  26.77 శాతం తక్కువకు ఈ కంపెనీ రివర్స్‌ టెండరింగ్‌లో కోట్‌ చేయడం వల్ల రూ. 51.15కోట్ల ప్రజా ధనం ఆదా అయ్యింది.


నిర్దేశితప్రమాణాలు కలిగిన 14,944 మల్టీ ఫంక్షన్‌ ప్రింటర్స్‌ కోసం ప్రభుత్వం టెండర్లు పిలవగా రూ.38,92,76,256 కోట్లకు కోట్‌ చేసిన కంపెనీ ఎల్‌–1 గా నిలిచింది. దీనిపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లగా 24,60,26,256 రూపాయలకే మరో కంపెనీ కోట్‌ చేసింది. ఇది ఎల్‌–1 టెండర్‌ విలువ కన్నా 36.8 శాతం తక్కువ. దీనివల్ల రూ. 14,32,50000 వేల రూపాయిల ప్రజా ధనం ఆదా అయింది.  మొత్తంగా ప్రింటర్లు, డెస్క్‌టాప్, యూపీఎస్‌ల కొనుగోలులో రివర్స్‌ టెండరింగ్‌ వల్ల 65,47,50,000 రూపాయలు ఆదా అయ్యాయి.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం