శ్రీసిటీలో ఏపీ ట్రాన్స్క్ చీఫ్ ఇంజనీర్

అంతిమతీర్పు నెల్లూరు జిల్లా - శ్రీసిటీ 

 

శ్రీసిటీని సందర్శించిన ఏపీ ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్

 
శ్రీసిటీ, అక్టోబర్ 17

 

ఏపీ ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ కడప జోన్ చీఫ్ ఇంజనీర్ దేవానంద్ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. స్థానిక విద్యుత్ అధికారులతో కలసి ఆయన శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూశారు. జడ్ టీ టీ, టోరె పరిశ్రమలను సందర్శించారు. అనంతరం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇతర శ్రీసిటీ అధికారులతో కలసి పారిశ్రామిక ప్రగతి, విద్యుత్ వినియోగం, డిమాండ్, ఇతర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీసిటీలో విద్యుత్ మౌళిక సదుపాయాలు, దాని నిర్వహణ తీరు బాగుందన్న ఆయన, శ్రీసిటీ యాజమాన్య చర్యలను ప్రశంసించారు. ఇంకా అన్నివిధాలా తమ సహకారం అందిస్తామన్నారు. చీఫ్ ఇంజనీర్ తో పాటు తిరుపతి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రతాప్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకర్, డివిజనల్ ఇంజనీర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.