అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పతకాలను అందజేయడం జరుగుతుందని


తేది ; 02.10.2019
చిత్తూరుకార్వేటినగరం,అక్టోబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పతకాలను అందజేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఏక్సైజ్ ,వాణిజ్య పన్నుల శాఖా మాత్యులు కె.నారాయణ స్వామి పేర్కొన్నారు.బుదవారం కార్వేటినగరం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి గ్రామ సచివాలయంను ప్రారంబించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంబిస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకాన్ని పారదర్శకంగా చేపట్టి పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేయడమనేది ఎంతో గొప్ప విషయమన్నారు.గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అన్నారు. బగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని తెలిపారు. జి.డి.నెల్లూరు నియోజక వర్గ అభివృద్దికి నా వంతు కృషి చేస్తా అన్నారు.అవినీతి రహిత పరిపాలన కోసం ముఖ్య మంత్రి  కృషి చేస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధికారుల వద్దకు వచ్చినప్పుడు అధికారులు ప్రజలను నవ్వుతూ పలకరించాలన్నారు. పోలిస్ వ్యవస్థను ఒక దేవాలయంగా తీసుకురండన్నారు. రాయలసీమ లో ప్రతి ఇంటికి నీరు ఇచ్చేందుకు ముఖ్య మంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు.ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రతి రోజు అమలు చేయాలనే తపనలో ముఖ్య మంత్రి ఉన్నారన్నారు.మద్యపాన నిషేదాన్ని దశల వారీగా అమలు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు.  4033 బెల్టు షాపులను రద్దు చేశామన్నారు.మద్య పాన నిషేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.విద్య అనేది చాలా ముఖ్యమని తల్ల్లిదండ్రులు తమ పిల్లలని విధిగా చదివించాలన్నారు. ప్రతి గ్రామంలో స్మశానం అనేది చాలా అవసరమని స్మశాన ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు.కార్వేటి నగరం టౌన్ ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు.


 చిత్తూరు డివిజన్ ఆర్.డి.ఓ డాక్టర్ సి.రేణుక మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి 150 వ మహాత్మా గాంధీ జంయతిని పురస్కరించుకొని నేడు గ్రామ సచివాలయాలను ప్రారంబించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పతకాలను ప్రజలకంది౦చేదుకు కృషి చేయాలన్నారు. ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎస్.సి చలపతి మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగాలలో భాగంగా కార్వేటినగరం మండలంలో లైన్ మెన్ లుగా ఎంపికైన 8 మందికి నేడు ఉప ముఖ్య మంత్రి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేసామన్నారు.తాహసీల్దార్ అమరెంద్రబాబు మాట్లాడుతూ కార్వేటినగరం మండలంలో1539 మంది లబ్దిదారులను ఇండ్ల స్థలాలు లేని వారిగా గుర్తించామన్నారు. ఎం.పి.డి.ఓ చిన్న రెడ్డెప్ప మాట్లాడుతూ ప్రజలకు నాయ్నమైన సేవలను అందించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందన్నారు.


 తొలుత కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకుంది.అనంతరం ఉప ముఖ్య మంత్రి మహాత్మా గాంధీ చిత్ర పటం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు.చివరగా కార్వేటి నగరం మండలంలో 
గ్రామ సచివాలయాల ఉద్యోగాలలో భాగంగా విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ లుగా ఎంపికైన 8 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి అందజేసారు.


 ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు మహిళలు ప్రజలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.   


.


................