చంద్రబాబుపై బీజేపీ నేతల ఫైర్‌

చంద్రబాబుపై బీజేపీ నేతల ఫైర్‌
గుంటూరు: ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆయన భార్యపై సైతం విమర్శలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును భవిష్యత్తులో కూడా తమ దగ్గరకు రానివ్వమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి అన్నారు. టీడీపీతో కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. చచ్చిపోయిన పార్టీని బతికించుకోవటానికే చంద్రబాబు ఇప్పుడు మోదీపై ప్రశంసలు కురిపిస్తూ నాటకాలకు తెరతీశారని దుయ్యబట్టారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవంబరులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు నేతలు అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని పేర్కొన్నారు. భారీ చేరికల భయంతోనే చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాగా 2019 ఎన్నిక‌లకు ముందు తాను కేంద్రంతో(పార్టీ పేరు ఎత్త‌కుండానే) విభేదించామ‌ని, ఇదంతా ప్ర‌జ‌ల కోసమే చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్ర‌జ‌లు బాగానే ఉన్నారు గానీ.. తాము మాత్రం నాశనమయ్యామని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా బీజేపీతో పొత్తుకు సిద్ధ‌మ‌నేలా సంకేతాలు వెలువరించారు. 
బాబు ప్రస్ట్రేషన్‌లో ఉన్నారు : ప్రతిపక్ష నేత చంద్రబాబు వీధి రౌడీల భాష మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఘోర ఓటమితో నైరాశ్యంలో మునిగిపోయిన బాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసు అధికారులను సైతం ఇష్టారీతిన బెదిరిస్తున్నారని, ఆయనపై కేసు పెట్టాలని పేర్కొన్నారు. అధికారంలో ఉండగా ఒకరకంగా, లేకపోతే ఇంకోలా మాట్లాడటం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం