అక్టోబ‌రు 13న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2019 అక్టోబ‌రు 11  
అక్టోబ‌రు 13న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 13వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.