🔸కావలిలో వైకాపా నాయకుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, బీద రవిచంద్ర, నాయకులు
*సోమిరెడ్డి కామెంట్స్*
🔸కావలి టీడీపీ ఆఫీసులో కూర్చోవున్న కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గం..
🔸ఐదు నెలలుగా కావలిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, బెదిరిస్తుంటే ఇప్పటి వరకు పోలీసుల చర్యలు లేవు..దీని పర్యావసనమే ఈ రోజు కార్యాలయంపైకి తెగబడ్డారు..
🔸ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు చేయిదాటిపోతున్నాయి..
🔸టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు..
🔸ఎమ్మెల్యేలు, వారి పక్కనే ఉండే చోటా నేతలు చెప్పిందే చేస్తామనే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యం బతికేవుందా అనే అనుమానాలు వస్తున్నాయి..
🔸జిల్లాలో పది సీట్లు ఇచ్చి మంచిగా పరిపాలించండయ్యా అంటే దొంగ కేసులు పెట్టడంతో పాటు దౌర్జన్యాలు, అరాచకాలు, ఆస్తుల విధ్వంసాలు చేస్తున్నారు..
🔸టీడీపీ కార్యకర్తలను ఇళ్లకు వెళ్లి కొడుతూ తిరిగి బాధితులపైనే కేసులు పెడుతూ హింసిస్తున్నారు..
🔸అట్రాసిటీ కేసులు పెడుతూ చిన్న చిన్న కుటుంబాలను సైతం వేధిస్తున్నారు..
🔸వైకాపా నేతల తీరు మారకపోతే చూస్తూ ఊరుకోం..టీడీపీ శ్రేణుల ఓపికను పరీక్షించొద్దు..