వైసిపి అవినీతి సామ్రాజ్యానికి వాటాలు వేసి పంచుతున్నారా..?

వైసిపి ఎమ్మెల్యేలకు మధ్యవర్తిగా, సీఎం జగన్ ఇసుక పంచాయితీలు చేస్తున్నారా..?
వైసిపి అవినీతి సామ్రాజ్యానికి వాటాలు వేసి పంచుతున్నారా..?
నెల్లూరు టిడిపి కార్యకర్తలతో భేటిలో చంద్రబాబు ధ్వజం
''నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరాయి. వైసిపి ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాలలో పోటీబడి దందాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే దీని వెనుక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మధ్యవర్తిగా చేసే పంచాయితీలు మరో ఎత్తు. ఇసుక దందాలు, భూకబ్జాలు,వైసిపి అవినీతి సామ్రాజ్యానికి వాటాలు వేసి జగన్మోహన్ రెడ్డి పంచుతున్నారు.
 ఒక మహిళాధికారి ఇంటిపై వైసిపి ఎమ్మెల్యే దాడిచేసి కరెంట్ కట్ చేయడం, తాగునీరు నిలిపేయడం, చెత్తంతా తెచ్చి వెదజల్లడం,పాములు-జెర్రులు వేస్తామని బెదిరించడం...ఎంత అరాచకం..? 
తన ఫిర్యాదు తీసుకునేందుకు అర్ధరాత్రి ఒక మహిళ(అందునా మండలాధికారిణి) పోలీస్ స్టేషన్ ఎదుటే 8గంటలు ఆందోళన చేయాల్సివచ్చిందంటే, ఈ దుస్థితి రాష్ట్ర చరిత్రలో గతంలో ఉందా..? 
బెయిలబుల్ సెక్షన్లు పెట్టి, కేవలం 2గంటల్లోనే రైట్ రాయల్ గా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని విడుదల చేయడం రాష్ట్రంలో జగన్నాటకాలకు తాజా ఉదాహరణ. 
ఆ రోజు వనజాక్షి ఉదంతంపై ఇదే వైసిపి నేతలు ఏం మాట్లాడారు..? ఎన్నెన్ని విమర్శలు చేశారు..? ఆ సంఘటనపై టిడిపి ప్రభుత్వం శర్మ కమిటిని నియమించింది, వాస్తవాలను విచారించి ప్రజల ముందు పెట్టింది. 
మరి ఇప్పుడు ఎండివో సరళను బెదిరించి ఇంటిపై దాడిచేసిన మీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విషయంలో ఏం చేశారు..?
ముఖ్యమంత్రి మధ్యవర్తిగా రాజీ చేయడం ఏంటి..? వైసిపి నేత ఇంట్లో  పులివెందుల పంచాయితీ చేయడం ఏంటి..?
వైసిపి ప్రజా ప్రతినిధులు హద్దులు దాటి వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం.
దేనికైనా చట్టం ఉంది. న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. పోలీసులు నిస్సహాయంగా మారే పరిస్థితి ఉండకూడదు. 
టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పట్ల ఒకరకంగా, వైసిపి ప్రజా ప్రతినిధుల పట్ల ఇంకో రకంగా వ్యవహరించడం సరైందికాదు. చట్టం ఎవరికైనా ఒక్కటే. టిడిపి నేతలపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు, వైసిపి నేతలపై బెయిలబుల్ సెక్షన్లు పెట్టడాన్ని ఏవిధంగా సమర్ధించుకుంటారు..? తనకు ప్రాణహాని ఉందని ఒక మహిళా ఎండివో ఫిర్యాదులో పేర్కొంటే, దానికి కారకుడైన వైసిపి ఎమ్మెల్యేపై అందుకు తగిన సెక్షన్లు పెట్టాల్సిన బాధ్యత లేదా..?
సోమ,మంగళ వారాల్లో నెల్లూరులోనే ఉంటాను. వైసిపి ప్రభుత్వ తప్పుడు పనులను ఎండగడతాం. ప్రజల ముందు దోషిగా నిలబెడ్తాం. వైసిపి నేతల బాధితులకు పార్టీ తరఫున అండగా ఉంటాం'' అని చంద్రబాబు గుంటూరు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన నెల్లూరు రూరల్ టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో  మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ పార్టీ నేతలు పాల్గొన్నారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం