అక్టోబరు,019.
కరప, తూర్పు గోదావరి జిల్లా.
గ్రామ సచివాలయ సిబ్బందితో సీఎం ఆత్మీయ పలకరింపులు, కరచాలనాలు, గ్రూప్ ఫోటో
గ్రామ సచివాలయ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు
తూర్పు గోదావరి జిల్లా కరప సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి మమేకం అయ్యారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. ప్రతి ఉద్యోగికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలు సాధించినందుకు ప్రత్యేకంగా సీఎం శీ జగన్ అభినందించారు..
దేశ చరిత్రలోనే ఒక నూతన శకానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెస్తోన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆవిర్భావ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామ సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి చూపిన చొరవ ఇది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, కరపలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్, అందుకు చిహ్నంగా ఒక పైలాన్‌ను ఆవిష్కరించారు.
అంతకు ముందు గ్రామంలో పూర్తి హంగులతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడి ఉద్యోగులతో మమేకం అయ్యారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరించారు. భుజం మీద చేయి వేసి మాట్లాడారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తమ వద్దకు వచ్చి అలా మాట్లాడడంతో ఆ ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. అంతులేని ఆనందానికి లోనయ్యారు. కొందరు పాదాభివందనానికి ప్రయత్నిస్తే వద్దని వారించారు. అభిమానంతో తలపై చేయి వేసి ఆశీర్వదించారు. వారు గ్రూప్ ఫోటోలు కోరితే కాదనకుండా దిగారు.
ఆ తర్వాత తన సుదీర్ఘ ప్రసంగంలో కూడా గ్రామ సచివాలయాలకు ఎంపికైన ఉద్యోగులందరినీ అభినందించారు. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. 19.50 లక్షల మంది పరీక్ష రాస్తే, వారిలో దాదాపు 1.34 లక్షల మంది ఎంపికయ్యారని ప్రశంసించారు. వారంతా తన సొంత తమ్ముళ్లు, అక్కా చెల్లి వంటి వారని అభివర్ణించారు. ఆ విధంగా వారిని ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించారు.
తండ్రి చదివించారు..
కొడుకు ఉద్యోగం ఇచ్చారు:
సభ ప్రారంభంలో కొందరు ఉద్యోగులు తమ అనుభవాలను వేదికపై పంచుకున్నారు. ఈ సందర్భంగా అంబాజీపేట మండలం వక్కలంకకు చెందిన ఎం.విజయదుర్గ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
'ఆటో డ్రైవర్‌గా పని చేసే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అస్థమా రోగి అయిన మా అమ్మ కష్టపడి నన్ను చదివించింది. నాడు దివంగత మహానేత వైయస్సార్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఆ విధంగా నాడు మహానేత వైయస్సార్ చలువ వల్ల నేను చదువుకుంటే, నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నాకు ఉద్యోగం ఇచ్చి.. మా కుటుంబాన్ని ఆదుకున్నారు' అని విజయదుర్గ వివరించారు.
ముత్యాలు, పేపర్ కట్టింగ్లతో చిత్రాలు:
మరోవైపు ఇద్దరు విద్యార్థులు తమ ప్రతిభతో సభను ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌పై అభిమానంతో హర్షిత అనే విద్యార్థిని ఏకంగా 4.03 లక్షల ముత్యాలతో, నవరత్నాలు పథకాల చిహ్నాలతో కూడిన సీఎం చిత్రపటం రూపొందించారు. దాన్ని వేదికపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు.
ఇక సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన 2700 పేపర్ క్లిప్పింగ్స్‌తో సాయికిరణ్ అనే ఆరవ తరగతి విద్యార్థిని రూపొందించిన చిత్రపటాన్ని కూడా సభలో సీఎం శ్రీ వైయస్ జగన్ ఆవిష్కరించారు.