అమ్మ వారికి పట్టు వస్త్రాలు

 విజయవాడ : అక్టోబర్ 4 (అంతిమ తీర్పు):


శరన్నవరాత్రులలో 6వ రోజైన శుక్రవారం కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు .



శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి తరపున సీతానగరంలోని ఆయన ప్రభల ఆహామిల రామానుజ లక్ష్మీనారాయణస్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు నవదిలిచారు . దసరా ఉత్సవాల్లో బాగా ఏడాటు చేశారు . ఎక్కడ రద్దీ లేకుండా సజావుగా ధరలు కొనసాగేలా ఏర్పాటు చేశారు . 



పిల్లలకు వేడి పాలు సరఫరా చేస్తున్నారు . అమ్మవారిని దర్శించుకునే భక్తులకు వృద్ధులకు , వికలాంగుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పించడం పట్ల దేవస్థానం యంత్రాంగానికి , ప్రభుత్వానికి శుభాశీస్సులు అందజేస్తున్నామన్నారు .



 విష్ణుమూర్తి చెల్లెలైన కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి తరపున ఇతిహాసపరంగా మేనత్త వరుస అయిన అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేస్తున్నామన్నారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం